అప్పులపై రేవంత్ అవే అబద్ధాలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.8.50 లక్షల కోట్లు అప్పు మోపిందని సీఎం రేవంత్‌రెడ్డి తాజా చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
- బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది రూ.2.80 లక్షల కోట్లే
- ఎంపీ రఘునందన్‌రావు అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో లిఖిత పూర్వకంగా గణాంకాలు వెల్లడించిన కేంద్ర సర్కార్
- రూ.8.50 లక్షల కోట్ల అప్పు అంటూ సీఎం అభాండాలు
- కేంద్రం ఇచ్చిన వివరాలను మళ్లీ విడుదల చేసిన కేటీఆర్
హైదరాబాద్, జూలై 1(నమస్తే తెలంగాణ) : గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.8.50 లక్షల కోట్లు అప్పు మోపిందని సీఎం రేవంత్‌రెడ్డి తాజా చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన వాటితో కలిపి తెలంగాణ తొలి ప్రభుత్వం పదేండ్లలో చేసిన అప్పు రూ.3.50లక్షల కోట్లే అని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్పినా రేవంత్‌రెడ్డి అవే అబద్ధాలు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ చేసిన అప్పులపై కేంద్రం విడుదల చేసిన గణాంకాలను తెలంగాణభవన్‌లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మరోసారి విడుదల చేశారు.
లోక్‌సభలో ఎంపీ రఘునందన్‌రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి బీఆర్ఎస్ పాలన ముగిసే నాటికి(31 మార్చి, 2024) ప్రత్యక్ష బహిరంగ అప్పు రూ.3,50,520.39 కోట్లు మాత్రమేనని లిఖితపూర్వక సమాధానం ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి రూ.72వేల కోట్ల అప్పు తెలంగాణ వాటాగా వచ్చిందని, మిగతా సుమారు రూ.2.80లక్షల కోట్లు కేసీఆర్ పాలనలో చేశారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత కేసీఆర్ సరార్ హయాంలో జరిగిన అప్పులపై సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే తప్పుడు ఆరోపణలుచేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.8.50 లక్షల కోట్ల అప్పులు చేసిందనే ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టంచేశారు. పరిపాలనా లోపాలను, ఆర్థిక నిర్వహణ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ..‘గత ప్రభుత్వమే రాష్ర్టాన్ని దివాళా తీయించింది, చేతిలో పైసా లేదు’ అనే సాకులు చెబుతూ రూ.8.50 లక్షల కోట్ల అబద్ధాన్ని గోబెల్స్తరహాలో చెప్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
2004 నుంచి 2024 మార్చి 31 నాటికి తెలంగాణ ప్రభుత్వం సేకరించిన అప్పులు కేంద్రం లోక్‌సభకు సమర్పించిన నివేదిక
అప్పు రకం మొత్తం అప్పు
- బహిరంగ మారెట్ రుణాలు = రూ.3,14,545.68 కోట్లు
- కేంద్ర ప్రభుత్వం నుంచి పొందిన రుణాలు = రూ.18,057.16 కోట్లు
- స్వయంప్రతిపత్తి సంస్థల నుంచి రుణాలు = రూ.13,194.39 కోట్లు
- వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు, ఓవర్ డ్రాఫ్ట్‌లు = రూ.999.62 కోట్లు
- కేంద్ర ప్రభుత్వ ఎన్ఎస్ఎస్ఎఫ్కు జారీచేసిన ప్రత్యేక సెక్యూరిటీలు = రూ.4,723.16 కోట్లు
- మొత్తం ప్రత్యక్ష అప్పు = రూ.3,50,520.39 కోట్లు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

