హైదరాబాద్ : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, మోండా మార్కెట్ వర్తకుల సంఘం అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్కు(Talasani Shankar Yadav) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నివాళులు(Tribute) అర్పించారు. అనంతరం మోండా మార్కెట్ నుంచి బన్సీలాల్ పేటలోని గ్రేవ్ యార్డ్ వరకు సాగిన అంతిమయాత్రలో కేటీఆర్, మాజీ మంత్రులు మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ళ శ్రీనివాస్, రాకేష్ పాల్గొన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్వే సత్యనారాయణ, రోహన్ రెడ్డి, శంకర్ యాదవ్ భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. కాగా, శంకర్ యాదవ్(61) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించారు.