హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకులు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు (Errolla Srinivas) పితృవియోగం కలిగింది. ఆనారోగ్యంతో బాధపడుతున్న ఎర్రోళ్ల విజ్జయ్య (75) గురువారం మరణించారు. ఆయన మృతిపట్ల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాద సమయంలో వారికి మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు.