మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన కీలక ఘట్టాల్లో కాసోజు శ్రీకాంతాచారి ఆత్మార్పణం ఒకటి అని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేయడానికి.. తన శరీరాన్ని ఒక సమిధలా చేసి ఆత్మార్పణం చేసిన కాసోజు శ్రీకాంతాచారి త్యాగం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చిరకాలం నిలిచిపోతుందని అన్నారు.
తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు తెలిపారు. తెలంగాణ అమరవీరులకు జోహార్లు అని వ్యా్ఖ్యానించారు. కాగా, శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్వీ నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జంగయ్య, నాగారం ప్రశాంత్, మిథున్ ప్రసాద్, శ్రీకాంత్ ముదిరాజ్, నాగేందర్ రావు, అవినాష్, రాకేష్, సాయి గౌడ్, రమేష్, సంతోష్ నాయక్, అనూష, సంధ్య, స్నేహ, స్రవంతి తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.