సిరిసిల్ల టౌన్, ఆగస్టు 22 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సిరిసిల్ల పట్టణంలో ఇటీవల పర్యటించిన సందర్భంలో ఆయన 32వ వార్డులోని మాజీ కౌన్సిలర్ సయ్యద్ సీమాబేగం-అక్రం ఇంటికి వెళ్లారు. అక్కడికి వచ్చిన పసుల శ్రీలక్ష్మి అనే విద్యార్థిని ఆయనకు రాఖీ కట్టి కుటుంబ పరిస్థితులను వివరించి, ఉన్నత చదువులకు సహకరించాలని కోరింది.
కేటీఆర్ స్పందించి ఆమె వివరాలను తీసుకున్నారు. హైదరాబాద్లోని శ్రీదేవి ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం ఫీజు రూ.లక్షా 12 వేలు చెల్లించి సీటు ఇప్పించారు. ఈ సందర్భంగా విద్యార్థిని శ్రీలక్ష్మి కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.