హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ పరిరక్షణ-ప్రజాస్వామ్య విలువలపై సోమవారం తెలంగాణ భవన్లో ఉదయం 11:30 గంటలకు ప్రత్యేక నాటికను ప్రదర్శించనున్నారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా..
రాజ్యాంగ ఉల్లంఘనలను ఎండగడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పేలా నిర్వహిస్తున్న నాటిక ప్రదర్శనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, శ్రేణులు హాజరుకానున్నారు.