హైదరాబాద్: సిటీ బస్సులో పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ‘చలో బస్ భవన్’ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ (BRS) చేపట్టింది. తీవ్ర నిర్బంధాల నడుమ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, వాణి దేవి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, లక్ష్మారెడ్డి, పార్టీ నేతలు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి బస్ భవన్ చేరుకున్నారు. అనంతరం టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కేటీఆర్, హరీశ్, సబిత, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు భేటీ అయ్యారు. గ్రేటర్ పరిధిలో పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ తరఫున లేఖ అందజేశారు. ప్రభుత్వ బకాయిల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం రూ.1353 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్టీసీ ఎండీ బీఆర్ఎస్ నేతలకు తెలిపారు. కేసీఆర్ హయాంలో రూ.9246 కోట్ల ఆర్టీసీ గ్రాంట్‌ను విడుదల చేశారని ఆర్టీసీ ఎండీకి కేటీఆర్ తెలిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ముంచేలా కనబడుతున్నదని ఆరోపించారు. మొత్తంగా సంస్థను ప్రైవేటుకు అప్పగించే కుట్ర చుస్తున్నదని చెప్పారు. పెంచి బస్ చార్జీలను తగ్గించాలని చెప్పారు.
1353 కోట్లు ‘మహాలక్ష్మి’ పథకం బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని స్వయంగా తెలిపిన ఆర్టీసీ ఎండీ
బస్ భవన్లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి ప్రతిపాదన అందజేసిన బీఆర్ఎస్ నాయకులు
పెంచిన చార్జీలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్టీ తరపున లేఖ అందజేసిన బీఆర్ఎస్ ప్రతినిధులు https://t.co/Nzcy8Ka86Z pic.twitter.com/uXELJgfxSp
— Telugu Scribe (@TeluguScribe) October 9, 2025