KTR | హైదరాబాద్ మే 13 (నమస్తే తెలంగాణ): హామీలు అమలు చేయకుండా అడుగడుగునా ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ మోసాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో వరంగల్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కనీవినీ ఎరుగని రీతిలో వరంగల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్ అంతం ఆరంభమైందని అభివర్ణించారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో మరింత విస్తృత పోరాటాలు చేస్తామని స్పష్టంచేశారు. రైతు ఆత్మహరూపొందించుకోవాలని చెప్పారు. ‘వాగు దాటే దాకా ఓడ మల్లన్న.. వాగు దాటినంక బోడి మల్లన్న’ అన్నట్టు రేవంత్ ప్రభుత్వ పాలన ఉన్నదని విమర్శించారు. కాంగ్రెస్ అరాచకాలను ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఎదురొంటుందని ధీమా ఇచ్చారు.
ప్రజాపాలన పేరుతో అధికారంలో వచ్చి ప్రజలను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ అంతానికి వరంగల్ సభతో ఆరంభం మొదలైందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ప్రజల్లో ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని తాను ఇప్పటివరకు చూడలేదన్నారు. అనుభవలేమి, మోసం, అత్యాశ, అందినకాడికి దోచుకోవడం అనే లక్షణాలు పుషలంగా ఉన్న రేవంత్ సరార్తో తెలంగాణ అభివృద్ధి రెండు దశాబ్దాలు వెనకి పోయిందన్నారు.
రైతు సమస్యలపై విస్తృత పోరాటాలు
రైతు ఆత్మహత్యలు, వారి సమస్యల పరిషారంపై రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విసృ్తత పోరాటాలు చేస్తుందని కేటీఆర్ తెలిపారు. రైతు భరోసా చెల్లింపులు సక్రమంగా జరగకపోవడం, ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పార్టీ కార్యచరణ ఉండబోతుందని చెప్పారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, ఉద్యోగ నియామకాల్లో అవకతవకలపై సమగ్ర వ్యూహంతో ప్రజా ఉద్యమాలను ప్రారంభిస్తామని వెల్లడించారు.
మోసానికి మారుపేరైన కాంగ్రెస్ నైజాన్ని ప్రజాక్షేత్రంలోనే ఎండగడుతామని స్పష్టంచేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలును కాంగ్రెస్ ఎలా విస్మరించిందో ప్రజలకు వివరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను, అవినీతిని ప్రజల్లో బయటపెడతామని, ప్రజలను మోసం చేస్తూ వేధిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోరాటాలకు పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పారు.
తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద బహిరంగ సభ
తెలంగాణ చరిత్రలోనే అత్యంత భారీ సభగా ఎలతుర్తి మీటింగ్ నిలిచిందని కేటీఆర్ అభివర్ణించారు. ఈ విజయానికి కారణమైన ప్రతి కార్యకర్తకు, నేతకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పకడ్బందీ ప్రణాళిక, క్రమశిక్షణ, ప్రజల్లో బీఆర్ఎస్పై ఉన్న అంతులేని అభిమానానికి ఎలతుర్తి సభనే నిదర్శనమని చెప్పారు. ఎలతుర్తి బహిరంగ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల దిశ మారిందని తెలిపారు. ‘ఇప్పుడైనా, ఎప్పుడైనా రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువు బీఆర్ఎస్సే. సభ తర్వాత ప్రజలు, కార్యకర్తల్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చింది.
కాంగ్రెస్ అరాచకాలపై అలుపెరగని పోరాటం చేసే ఉత్సాహం కలిగింది’ అని తెలిపారు. ఏనాటికైనా తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్సే శ్రీరామరక్ష అన్న సంగతి సభతో మరోసారి నిరూపితమైందన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్‌తో మాట్లాడారు. పార్టీ 25 సంవత్సరాల సంబురాన్ని వరంగల్ గడ్డపై నిర్వహించే అవకాశం తమకు ఇచ్చినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అన్ని విషయాల్లో తమకు దిశానిర్దేశం చేసిన పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం వరంగల్ నేతలతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. కేటీఆర్ ఇచ్చిన ఆత్మీయ విందులో శాసనమండలిలో ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, పొన్నాల లక్ష్మయ్య, డీఎస్ రెడ్యా నాయక్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, వొడితల సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, బానోత్ శంకర్‌నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ మాజీ అధ్యక్షులు ఎం సుధీర్‌కుమార్, గండ్ర జ్యోతి, అంగోత్ బిందు, పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, నాగుర్ల వెంకటేశ్వర్లు, కే వాసుదేవారెడ్డి, వై సతీశ్‌రెడ్డి, మెట్టు శ్రీనివాస్, ఏనుగుల రాకేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ పిల్లల ఆరోగ్యంపై లేదా?
అందాల పోటీలపై సమీక్షలతో బిజీగా ఉంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌కు పిల్లల ఆరోగ్యం గురించి పట్టించుకొనే సమయమెక్కడిదని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ఫీవర్ హాస్పిటల్లో పిల్లల వైద్యుల్లేక చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంగళవారం ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు. ‘పిల్లల వైద్యులను నియమించేందుకు ప్రభుత్వానికి ఎంత సమయం పడుతుంది? పిల్లలు, వారి తల్లిదండ్రులు ఏడాదికిపైగా ఎందుకు బాధపడాలి? ఇందుకు పాలకులు కారకులు కాదా?’ అని ప్రశ్నించారు. వానకాలం సమీపిస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే వైద్యుల నియామకంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.