సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నేతల్లో కేటీఆర్ ఒకరు. ఆసక్తికరమైన, స్ఫూర్తివంతమైన విషయాలపై స్పందిస్తూ ఉంటారాయన. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక ట్వీట్‌పై స్పందించారు. ఇదిప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ‘‘ది బెటర్ ఇండియా’’ అనే ట్విటర్ హాండిల్ ట్వీట్ చేసిన ఒక వీడియోలో.. మెహక్ ఫాతిమా అనే ఆరేళ్ల చిన్నారి గురించి ప్రస్తావించింది.
కోజికోడ్‌కు చెందిన ఈ చిన్నారికి ఒక తమ్ముడు ఉన్నాడు. మూడేళ్ల ఆ బుడతడికి వాళ్ల తండ్రి క్రికెట్ నేర్పిస్తున్నాడు. ఆమెకు నేర్పించలేదు. దీంతో ‘‘నేను అమ్మాయినని నాకు నేర్పించడం లేదా నాన్నా?’’ అంటూ తండ్రిని నిలదీసింది. ఆ మాటలతో తన పొరపాటు అర్థం చేసుకున్న ఆ తండ్రి.. మెహక్‌కు క్రికెట్ పాఠాలు నేర్పించాడు. అంతే, ఇక ఆమెకు ఎదురులేకుండా పోయింది. చేతిలో బ్యాటుతో ఇరగదీస్తోంది.
కచ్చితమైన ఫుట్‌వర్క్, పూర్తి బ్యాలెన్స్‌తో ఆమె క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కవర్ డ్రైవ్‌లు, స్ట్రెయిట్ షాట్లు, ఫ్లిక్, డిఫెన్స్, పుల్ షాట్.. ఇలా క్రికెట్ బుక్‌లో ఉన్న షాట్లన్నీ ఆడుతున్న ఆమె టెక్నిక్కు మన కేటీఆర్ కూడా ఫిదా అయిపోయారు. లవ్ సింబల్‌తో ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. దీంతో ఫాతిమా ట్యాలెంట్ ఇప్పుడు ట్విట్టర్లో పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది.
— KTR (@KTRTRS) February 23, 2022