హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుబారా ఖర్చుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. 13 గ్రామా ల్లో 26 సీఎంఆర్ఎఫ్ చెకుల పంపిణీకి 25 వాహనాలను వినియోగించడం, ఏకం గా 100 మంది పోలీసులతో భద్రత క ల్పించడం ఏమిటని ప్రశ్నించారు. అసలు పం చిన చెకుల విలువెంత? 25 వాహనాల కు, 100 పోలీసుల జీతభత్యాలకు అయి న ఖర్చెంత? అని నిలదీస్తూ.. రేవంత్ సర్కా రు పనితీరు ‘చారాణా కోడికి బారాణా మసాలా’ అన్నట్టుగా ఉన్నదని ఎద్దేవా చేశారు. ఓడిపోయిన అభ్యర్థికి చెకులు ఇవ్వ డం, వాటిని పంపిణీ చేసేందుకు భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చే శారు. హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పక్కనపెట్టి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి వొడితెల ప్రణవ్‌తో చెకుల పంపిణీ చేయించడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు.