మొగుళ్లపల్లి, జూలై 27: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామానికి చెందిన చిట్యాల ఏఎంసీ మాజీ చైర్మన్ కొడారి రమేశ్ తండ్రి, మాజీ సర్పంచ్ కొడారి కొమురయ్య విగ్రహ ఆవిషరణ కోసం బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదివారం గ్రామానికి వచ్చారు. విగ్రహావిషరణకు వెళ్లేదారిలో పొలాల్లో నాట్లు వేస్తున్న మహిళలను కేటీఆర్ ఆత్మీయంగా పలకరించారు. ‘ఏం అవ్వ.. కాంగ్రెస్ పాలన ఎట్లా ఉన్నది’ అంటూ ప్రశ్నించారు. దీంతో ‘ఏం పాలన సారూ.. యూరియా దొరుకుత లేదు.. పేదలకు ఇండ్లు అందుత లేవు.. మీ పాలనే మంచిగుండేది. ఇప్పుడు అన్ని కష్టాలే.. టైముకు రైతుబంధు ఇస్తలేరు.. మహిళలకు రూ.2,500, ముసలోళ్లకు పింఛన్లు, కల్యాణలక్ష్మి తులం బంగారం ఇయ్యడం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానివి అన్నీ ఉత్తమాటలే..’ అంటూ మహిళలు కేటీఆర్‌తో చెప్పారు. ‘అందుకే కేసీఆర్ పెద్ద సార్ చెప్పిండా.. కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే మోసపోతామని.. ఇప్పటికైనా గమనించి బీఆర్ఎస్కి అండగా ఉండాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా కొట్లాడుతాం’ అంటూ మహిళా రైతులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. అనంతరం మహిళా రైతులతో కరచాలనం చేసి, మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని వారికి ధైర్యం చెప్పారు.