హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నార్సింగిలోని తన నివాసంలో గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. శాససనభ నుంచి సభ్యుల సస్పెన్షన్ తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు ఎనుముల కొండల్డ్డికి చెందిన టెస్సెరాక్ట్ కంపెనీకి తుక్కుగూడలో కేటాయించిన భూమి సందర్శన, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదుతో భవిష్యత్‌లో చేపట్టాల్సిన పోరాట కార్యాచరణపై ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ఫాసిస్ట్ ప్రభుత్వంపై ఉద్యమాన్ని ఉధృతం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ సమావేశంలో మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్లు తన్నీరు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితాఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.