KTR | కేసీఆర్‌ను తిట్టేందుకు ప్రత్యేక సభ పెట్టండి : కేటీఆర్
KTR | సీఎం రేవంత్ రెడ్డితో సహా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు నిత్యం కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తుండటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్‌ను తిట్టేందుకు ఒకరోజు ప్రత్యేకంగా సభ పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. మిగిలిన రోజుల్లో ప్రజా సమస్యలు, అమలుకాని హామీలపై చర్చిద్దామని ఎద్దేవా చేశారు.
KTR : సీఎం రేవంత్ రెడ్డితో సహా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు నిత్యం కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తుండటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్‌ను తిట్టేందుకు ఒకరోజు ప్రత్యేకంగా సభ పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. మిగిలిన రోజుల్లో ప్రజా సమస్యలు, అమలుకాని హామీలపై చర్చిద్దామని ఎద్దేవా చేశారు. ఎర్రవల్లికి వెళ్తున్న తనను పోలీసులు మార్గమధ్యలో అడ్డుకుని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో పోలీస్‌స్టేషన్ దగ్గరే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలోని లోపాలను బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుండటంతో రేవంత్ రెడ్డి సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్‌ను ఎండగట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కారు కుట్రలకు తెరలేపింది. సోమవారం బీఆర్ఎస్ మహిళ ఎమ్మేలపై అవమానకర రీతిలో దాడులు చేయించింది.
తిరిగి బీఆర్ఎస్ నేతలపైనే అక్రమంగా కేసులు పెట్టించింది. పైగా ఒకవైపు అసెంబ్లీ నడుస్తుంటే మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరిని కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై దాడికి పంపించింది. వారిని అడ్డుకునేందుకు వెళ్లిన బీఆర్ఎస్ అగ్రనేతలను అడ్డుకుని బోయనపల్లి పోలస్స్టేషన్కు తరలించింది. ఈ క్రమంలో బోయినపల్లి పోలీస్‌స్టేషన్ దగ్గర కాంగ్రెస్ సర్కారు తీరుపై కేటీఆర్ విమర్శలు గుప్పంచారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | 20 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు.. అయినా రైతుకు పలకరింపేది?
Jio IPO | జియో ఐపీవోకు యమ క్రేజ్.. 5.57 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

