రైతుకు పలుకరింపేది?
నీళ్లను ఎత్తిపోయకుండా, విద్యుత్తును ఉత్పత్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కరువును తెచ్చిందన్న అభిప్రాయం రైతుల్లో గూడుకట్టుకున్నది. కాంగ్రెస్ సర్కార్ నిర్వాకం, నిర్లక్ష్యంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆరుగాలం కష్టం కాంగ్రెస్ తెచ్చిన కరువుపాలైందని కన్నీరుమున్నీరవుతున్నారు.
- ముఖం చాటేసిన అధికార పార్టీ నేతలు
- పంటలెండుతున్నా పలుకరించని వైనం
- పత్తాలేని మంత్రులు, శాసనసభ్యులు
- భోరున విలపిస్తున్న అన్నదాతలు
- ప్రభుత్వం నుంచి కరువైన భరోసా
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): నీళ్లను ఎత్తిపోయకుండా, విద్యుత్తును ఉత్పత్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కరువును తెచ్చిందన్న అభిప్రాయం రైతుల్లో గూడుకట్టుకున్నది. కాంగ్రెస్ సర్కార్ నిర్వాకం, నిర్లక్ష్యంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆరుగాలం కష్టం కాంగ్రెస్ తెచ్చిన కరువుపాలైందని కన్నీరుమున్నీరవుతున్నారు. పంటలు ఎండిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి కనీసం పలుకరింపు కరువైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుంచి మొదలుకొని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇలా అంతా రైతులకు ముఖం చాటేశారు. కనీసం ఎండిన పొలాల్లోకి వెళ్లి వాటిని పరిశీలించి రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇప్పటికే సుమారు 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినట్లు వ్యవసాయ శాఖ నివేదిక ఇచ్చింది. అయినప్పటికీ, ఇప్పటివరకు కనీసం ఒక్కరంటే ఒక్క మంత్రిగానీ, అధికార పార్టీ ఎమ్మెల్యేగానీ రైతుల వద్దకు వెళ్లలేదు, వారికి భరోసా కల్పించనూ లేదు.
రైతులకు అండగా బీఆర్ఎస్
‘ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటక బోడి మల్లన్న’ అన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహారం ఉన్నదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతులను రాజులను చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. తీరా అధికారంలోకి వచ్చాక తమను నట్టేట ముంచుతున్నదని మండిపడుతున్నారు. కరువుతో అల్లాడుతున్న రైతులను కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టింది. కాగా తామున్నామంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్రవ్యాప్తంగా ఎండిన పంట పొలాలను పరిశీలిస్తున్నారు. రైతులకు భరోసా కల్పిస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తుండటం గమనార్హం. ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగర్ కర్నూల్ జిల్లా ఇటిక్యాల గ్రామ శివారులో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు.
బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు గురువారం సిద్దిపేటలో ఎండిన పొలాలను పరిశీలించి రైతులను ఓదార్చారు. నల్లగొండ జిల్లా తెలకంటిగూడెం గ్రామంలో సాగునీరు అందక ఎండిపోయిన పంటల పొలాలను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరిశీలించారు. కొల్లాపూర్ ప్రాంతంలోని శింగవరం, గోపులాపూర్ గ్రామాల్లో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఎండిన పంటలను పరిశీలించారు. జూరాల ఆయకట్టు కింద నీరు అందకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎండిన పొలాలను పరిశీలించారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పలు ప్రాంతాల్లో పర్యటించి ఎండిన పొలాలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మం త్రులు వారి ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎండిన పొలాలను పరిశీలిస్తూ రైతులకు ధైర్యం చెప్తున్నారు. రైతులకు పంటనష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
మీటింగ్‌లు తప్ప పలుకరింపుల్లేవు-పరిహారం లేదు
ఒకవైపు సాగునీళ్ల కొరత, మరోవైపు అప్రకటిత విద్యుత్తు కోతలతో పంటలు ఆగమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాలకుపైగా పంటలు ఎండినట్లు అంచనా. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో ఏర్పడిన కరువుతో పంటలు ఎండిపోవడంతో రైతులకు రూ.20 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ యూనివర్సిటీ లెక్కతేల్చింది. అయినప్పటికీ రైతులను ఆదుకోవాలనే కనీస ఆలోచన కూడా ప్రభుత్వ పెద్దలకు రావడంలేదు. సీఎం రేవంత్‌రెడ్డి కరువుపై అధికారులు, మం త్రులతో మీటింగ్‌ల మీద మీటింగ్‌లు పెడుతున్నారు.
కానీ, ఆ మీటింగ్‌ల వల్ల రైతులకు కనీస ప్రయోజనం కూడా చేకూరలేదు. అంత భారీ నష్టం వాటిల్లినా రైతులకు పరిహారం ప్రకటించే విషయంలో ప్రభుత్వం మౌనంగానే ఉన్నది. ఇప్పటివరకూ పైసా పరిహారం ప్రకటించలేదు. కాస్త దూరం వెళ్లడానికి సైతం సీఎంతోపాటు మంత్రులు హెలికాప్టర్‌ను వినియోగిస్తున్నారు. కానీ, పంటలు ఎండిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులకు ఆర్థిక సాయం చేయడానికి మాత్రం ఆర్థిక పరిస్థితి అడ్డువస్తున్నది. పరిహారం ఆర్థిక అంశంతో కూడినందున ఇవ్వలేకపోతున్నారు. రైతులను పలుకరించేందుకు ఏ ఆర్థిక అంశం అడ్డు వస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

