జియో ఐపీవోకు యమ క్రేజ్
జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఐపీవో.. మదుపర్లకు పూనకాలు తెప్పిస్తున్నది. ఎగబడిమరీ కొనేస్తున్నారు. బిడ్డింగ్ మొదలైన తొలిరోజే (బుధవారం) దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. రెండో రోజైన గురువారం కూడా ఇన్వెస్టర్ల నుంచి విపరీతమైన డిమాండ్ కనిపించింది.
- 5.57 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
- 110 కోట్లకుపైగా షేర్లకు దాఖలైన బిడ్లు
- ఇప్పటిదాకా డిమాండ్ విలువ రూ.3.73 లక్షల కోట్లు
ముంబై, అక్టోబర్ 22: జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఐపీవో.. మదుపర్లకు పూనకాలు తెప్పిస్తున్నది. ఎగబడిమరీ కొనేస్తున్నారు. బిడ్డింగ్ మొదలైన తొలిరోజే (బుధవారం) దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. రెండో రోజైన గురువారం కూడా ఇన్వెస్టర్ల నుంచి విపరీతమైన డిమాండ్ కనిపించింది. దీంతో ఇప్పటిదాకా 5.57 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్ అయ్యింది. అన్ని వ్యక్తిగత విభాగాల నుంచి విశేష స్పందన వస్తుండగా.. 19.75 కోట్ల షేర్లను ఆఫర్‌కు పెడితే గురువారం సాయంత్రం 5 గంటలకల్లా 110.03 కోట్ల షేర్లకు సరిపడా బిడ్లు దాఖలయ్యాయి. షేర్ గరిష్ఠ శ్రేణి ధరతో చూస్తే.. ఈ డిమాండ్ విలువ రూ.1,23,129 కోట్లు (బుధవారం 62.36 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలవగా, దీని వాల్యూ రూ.69,800 కోట్లు)గా ఉన్నది. ఇందులో గురువారం (47.67 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి) దాఖలైన బిడ్ల విలువ రూ.53,329 కోట్లు. దీంతో యాంకర్ బుక్ బిడ్డింగ్ వాల్యూతో కలిపితే ఇది రూ.3.73 లక్షల కోట్లకుపైగానే ఉంటున్నది. సోమవారం నిర్వహించిన యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్‌లో రూ.8,110 కోట్ల షేర్లకుగాను ఏకంగా రూ.2.5 లక్షల కోట్లకుపైగా విలువైన బిడ్లు దాఖలైన సంగతి విదితమే. శుక్రవారం కూడా ఈ ఐపీవో బిడ్డింగ్ కొనసాగనున్నది.
ఐపీవో విలువ: రూ.30,213 కోట్లు
- షేర్ ధరల శ్రేణి: రూ.1,065-1,119
- ఐపీవో ముగిసే తేదీ: శుక్రవారం (అక్టోబర్ 23)
- మదుపర్ల మధ్య షేర్ల కేటాయింపులు: సోమవారం (అక్టోబర్ 26)
- డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్ల జమ: మంగళవారం (అక్టోబర్ 27)
- బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో జియో ప్లాట్‌ఫామ్స్ నమోదు: బుధవారం (అక్టోబర్ 28)
- 65.1 కోట్ల షేర్ల (రూ.72,898 కోట్లు)కు బిడ్లు వేసిన క్వాలిఫైడ్ సంస్థాగత మదుపర్లు (క్యూఐబీ)రెట్లు
- రూ.24,330 కోట్ల విలువైన షేర్లకు బిడ్డింగ్ చేసిన సంస్థాగతేతర మదుపర్లు (ఎన్ఐఐ)
- రూ.14,652 కోట్ల విలువైన బిడ్లు దాఖలు చేసిన రిటైల్ వ్యక్తిగత మదుపర్లు (ఆర్ఐఐ)
- రూ.500 కోట్లకుగాను రూ.1,103 కోట్లషేర్లకు సరిపడా బిడ్లు వేసిన ఉద్యోగులు
- రూ.10,107 కోట్లు దాటిన కంపెనీ ప్రస్తుత వాటాదారుల బిడ్డింగ్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

