పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి!
పట్టణాలకు పరమితమైన డ్రగ్స్ మహమ్మారి పల్లెల గడపలోకి ప్రవేశించింది.గ్రామాల్లో కొందరు యువకులు గ్రూపులుగా ఏర్పడి డ్రగ్స్, గంజాయి సేవిస్తూ పలు నేరాలకు పాల్పడుతున్నారు. యువతను చిత్తు చేస్తున్న డ్రగ్స్, గంజాయిని అరికట్టాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట, నంగునూరు మండలాల్లో డ్రగ్స్, గంజాయి తదితర మత్తుపదార్థాలను సేవించిన యువతతోపాటు మైనర్లు సైతం నేర ప్రవృత్తిలోకి దిగుతున్నారు.
- విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత
- మత్తులో నేరాలకు పాల్పడుతున్న వైనం
- ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?
చేర్యాల/మద్దూరు(ధూళిమిట్ట), అక్టోబర్ 22: పట్టణాలకు పరమితమైన డ్రగ్స్ మహమ్మారి పల్లెల గడపలోకి ప్రవేశించింది.గ్రామాల్లో కొందరు యువకులు గ్రూపులుగా ఏర్పడి డ్రగ్స్, గంజాయి సేవిస్తూ పలు నేరాలకు పాల్పడుతున్నారు. యువతను చిత్తు చేస్తున్న డ్రగ్స్, గంజాయిని అరికట్టాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట, నంగునూరు మండలాల్లో డ్రగ్స్, గంజాయి తదితర మత్తుపదార్థాలను సేవించిన యువతతోపాటు మైనర్లు సైతం నేర ప్రవృత్తిలోకి దిగుతున్నారు.
తాజాగా ధూళిమిట్ట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థినిని అదే మండలంలోని మరో గ్రామానికి చెందిన ఏడుగురు యువకులు (నలుగురు మేజర్లు, ముగ్గురు మైనర్లు) బైక్‌లపై వచ్చి కొమురవెల్లికి తీసుకువెళ్లి అక్కడ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ విషయం పోలీసులకు చేరడంతో విచారణ సాగిస్తున్నారు. చేర్యాల పట్టణానికి చెందిన యువకులు గంజాయిని ఇక్కడ విక్రయించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి తీసుకువస్తూ అక్కడి పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లారు. పట్టణ సమీపంలోని చుంచనకోట గుట్టల్లో పలుమార్లు యువకులు గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారు. అర్జునపట్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు నిత్యం బైక్‌పై గంజాయిని హైదరాబాద్ నుంచి చేర్యాల ప్రాంతానికి తీసుకువస్తూ ఇక్కడ సరఫరా చేస్తుండటంతో ఎక్సైజ్ అధికారులకు దొరికిపోయాడు.
వివిధ రూపాల్లో మత్తుపదార్థాలు
చేర్యాల ప్రాంతానికి వివిధ రూపాల్లో మత్తుపదార్థాలను చేరవేస్తున్నారు. చేర్యాల పట్టణంలో కూలి పనులకు వచ్చిన బీహార్ రాష్ర్టానికి చెందిన పలువురు అక్కడి నుంచి గంజాయిని చాక్లెట్ల రూపంలో తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఏపీతో పాటు పొరుగు రాష్ర్టాల నుంచి మత్తు పదార్థాలు ఇక్కడికి వస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల సరిహద్దులో ఉన్న చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలను టార్గెట్ చేసుకుని పలువురు డ్రగ్స్, గంజాయి సరఫరాచేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది.
వీడియోలు తీసి బెదిరిస్తున్న వైనం
మత్తు పదార్థాలు సేవించిన పలువురు యువకులు మహిళలు, బాలికలు, యువతులకు మాదకద్రవ్యాలు ఇచ్చి లోబర్చుకుంటున్నారు. వారి నగ్న వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తామంటూ బెదిరింపులకు దిగుతూ వారిపై పలుమార్లు లైంగికదాడికి దిగుతున్నారు. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన యువకులతో పాటు చేర్యాలకు చెందిన పలువురు ఫిబ్రవరి నుంచి మత్తు పదార్థాలు, ఇంజెక్షన్లు ఇచ్చి లోబర్చుకుని వీడియోలు తీసి వాటిని ఇంటర్నెట్లో పెడుతామని బెదిరిస్తూ నేటికీ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చినా మరెందరో బాధితులు చెప్పుకొనేందుకు బయటకురాక నరకం అనుభవిస్తున్నట్టు సమాచారం.
ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
ధూళిమట్ట మండలంలోని రెండు గ్రామాలకు చెందిన నలుగురు మేజర్లు, ముగ్గురు మైనర్లను మద్దూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టాల్సిన ఎక్సైజ్, నార్కోటిక్ పోలీస్ బృందాలు ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేసి, డ్రగ్స్ మహమ్మారిని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

