వరంగల్, ఫిబ్రవరి 7 : రెండు రోజుల కిత్రం రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పరకాలకు చెందిన అరవింద్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. అరవింద్ గురువారం శాతవాహన ఎక్స్ప్రెస్ నుంచి కేసముద్రం సమీపంలో ప్రమాదవశాత్తు జారి పడడంతో రెండు కాళ్లు విరిగాయి. అరవింద్ ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకవెళ్లారు.
వెంటనే స్పందించిన ఆయన వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ద్వారా అరవింద్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని బాధిత కుటుంబానికి రూ.50వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. నగరంలోని గార్డియన్ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆరవింద్ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే నరేందర్, కేటీఆర్ పంపించిన రూ.50వేలను కుటుంబసభ్యులకు అందజేశారు. ఆర్థిక సహాయాన్ని అందజేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.