KTR | పేదరికాన్ని 16.12 శాతం తగ్గించాం.. ప్రజా సంక్షేమం కోసమే రూ.2,86,230 కోట్ల వ్యయం: కేటీఆర్
స్వరాష్ట్ర ఏర్పాటు నాటికి తెలంగాణ సమాజం చిన్నాభిన్నమై దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను తొలి ప్రాధాన్యతగా ఎంచుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు.
- తెలంగాణ ఏర్పడినప్పుడు 21.92%.. ఇప్పుడు 5.8%
- ఆసరా పింఛన్లతో ఎంతో మంది అభాగ్యులకు అండగా నిలిచాం
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు స్పష్టీకరణ
KTR | హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్ర ఏర్పాటు నాటికి తెలంగాణ సమాజం చిన్నాభిన్నమై దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను తొలి ప్రాధాన్యతగా ఎంచుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ చర్యల వల్ల రాష్ట్రంలో పేదరికం 16.12% తగ్గిందని, తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో 21.92 శాతంగా ఉన్న పేదరికం.. ప్రస్తుతం 5.8 శాతానికి దిగివచ్చిందని పేర్కొన్నారు. సంక్షేమంలో స్వర్ణయుగాన్ని తీసుకొచ్చామని, చివరికి కొవిడ్ సంక్షోభ సమయంలోనూ సంక్షేమ కార్యక్రమాలను ఆపలేదని గుర్తుచేశారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, దివ్యాంగులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, కార్మికులు సహా సబ్బండ వర్గాల కోసం మానవీయకోణంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం రూ.2,86,230 కోట్లు వెచ్చించిందని గుర్తుచేశారు. విద్యా, వైద్యంతోపాటు సామాజిక భద్రత పథకాలతో భరోసా కల్పించిందని తెలిపారు.
ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మీ, దళితబంధు, ఎస్సీ సబ్‌ప్లాన్, అంబేద్కర్ భవనాలు, 125 అడుగుల విగ్రహం ఏర్పాటు, టీఎస్ ప్రైడ్, 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పంపిణీ కార్యక్రమాలను అమలు చేసిందని చెప్పారు. గిరిజనులకు తండాలు, గూడేల్లో స్వయం పాలన కల్పించిందని, 4 లక్షల ఎకరాల అడవి భూములపై హక్కులు కల్పించిందని, పోడు భూములకు పట్టాలిచ్చి రైతుబంధు మంజూరు చేసిందని, ఆదివాసీ, బంజార భవనాలు, జోడెఘాట్‌లో కుమ్రంభీం గోండు మ్యూజియం తదితర నిర్మాణాలు చేపట్టిందని వివరించారు. 204 గురుకులాలతో మైనార్టీల్లో విద్యా విప్లవం తీసుకొచ్చామని, పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీ పథకాలను అమలు చేయడంతోపాటు ఇమాం, మౌజంలకు రూ.10వేల గౌరవ వేతనం చెల్లించామని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యధిక జీతాలు ఇచ్చామని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 30% పీఆర్సీ వర్తింపజేశామని, 1.7 లక్షల మంది సఫాయి కార్మికులు, జీహెచ్ఎంసీ కార్మికులు, అంగన్వాడీలు, ఆశావర్కర్లు, 54 వేల మంది హోంగార్డుల వేతనాలు పెంచామని, వీఏవోలకు పేస్కేలు ఇచ్చామని, వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1.60 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని, ఐటీ రంగంలో 24 లక్షల ఉద్యోగాలు, ఇతర ప్రైవేట్ రంగంలో 15 లక్షల ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. ‘మా దృష్టిలో ఆస్తులంటే నిర్మాణాలే కాదు. ప్రజల్లో పెరిగిన జీవన ప్రమాణాలు. దేశానికే తలమానికంగా పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట. ప్రతి కుటుంబంలో పెరిగిన ఆత్మవిశ్వాసం. స్వల్పకాలంలోనే మేము సాధించిన రాష్ట్ర సమగ్రాభివృద్ధే తెలంగాణకు అసలైన గొప్ప ఆస్తి’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. సబ్బండ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన ఈ అమూల్యమైన ఆస్తులను ఎలా కొలుస్తారని ప్రశ్నించారు.
సబ్బండ వర్ణాల సంక్షేమానికి వెచ్చించిన నిధులు వర్గం/పథకం ఖర్చు (రూ.కోట్లలో)
- ఆసరా పింఛన్లు 61,000
- కల్యాణలక్ష్మి 11,743
- కేసీఆర్ కిట్ 1,500
- ఎస్సీ సంక్షేమం 92,640
- ఎస్టీ సంక్షేమం 43,936
- బీసీ సంక్షేమం 44,393
- మైనార్టీ సంక్షేమం 9,166
- సీఎంఆర్ఎఫ్ 3,000
- దివ్యాంగుల సంక్షేమానికి 10,300
- చేనేత రంగానికి ఏటా 1,200
- ఉద్యోగుల జీతాలు, 3,41,000
- పెన్షన్లకు రజక, నాయీబ్రాహ్మణుల 250 యూనిట్ల సంక్షేమానికి ఉచిత విద్యుత్తు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

