KTR : మూసీ సుందరీకరణ పేరుతో 50 వేలమందిని రేవంత్ రెడ్డి రోడ్డున పడేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ధ్వజమెత్తారు. పేదల ఇళ్లను కూల్చి మూసీ సుందరీకరణ చేపట్టడానికి బీఆర్ఎస్ వ్యతిరేకమని తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఎత్తున చేపట్టాలనుకుంటున్న మూసీ సుందరీకరణతో పేదలు రోడ్డున పడతారని కేటీఆర్ తెలిపారు. రేవంత్ సర్కార్ ఈ ప్రాజెక్ట్ పేరు ఎత్తినప్పటి నుంచి ప్రజల మధ్య తిరుగుతూ బాధితుల మొర వింటున్న కేటీఆర్ ప్రజల్లోని వ్యతిరేకతను వెల్లడించారు.
‘మొన్న నేను పాదయాత్ర చేస్తే చిన్న పిల్లగాడు వచ్చి అంకుల్ నా కిడ్డీ బ్యాంక్ తీసుకొని రేవంత్ రెడ్డికి ఇచ్చి మా ఇల్లు వదిలేయండని చెప్పమని చెబుతున్నాడు. మధ్యతరగతి ప్రజలు పైసా పైసా కూడబెట్టి లోన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటే.. ఇవాళ వాళ్ళ అందరిని ఎత్తి అవతల పడేస్తా అంటే EMIలు ఎవడు కట్టాలి?’ అని రేవంత్ సర్కార్ వైఖరిని కేటీఆర్ ప్రశ్నించారు.
50 వేల మంది ప్రజలను రేవంత్ రెడ్డి రోడ్డు మీద పడేయాలని చూస్తున్నాడు
మొన్న నేను పాదయాత్ర చేస్తే చిన్న పిల్లగాడు వచ్చి అంకుల్ నా కిడ్డీ బ్యాంక్ తీసుకొని రేవంత్ రెడ్డికి ఇచ్చి మా ఇల్లు వదిలేయండని చెప్పమని చెబుతున్నాడు
మధ్యతరగతి ప్రజలు పైసా పైసా కూడబెట్టి లోన్ తెచ్చుకొని ఇల్లు… pic.twitter.com/HEsR0Mvfad
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2026
ఈ సందర్భంగా పేదలైతే ఒకలా, పెద్దలైతే మరోలా వ్యవహరిస్తున్న హైడ్రాపై కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బఫర్ జోన్ అంటూ పేదల ఇళ్లను కూల్చేందుకు ఏమాత్రం ఆలోచించని హైడ్రాకు రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి దారి మాత్రం తెలియడం లేదని కేటీఆర్ విమర్శించారు.
హైడ్రాకు తిరుపతి రెడ్డి ఇంటికి దారి దొరకట్లేదు pic.twitter.com/bLckvMTocA
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2026