KTR | సిట్ అధికారులు చట్టాన్ని గౌరవించలేదు.. ప్రతి ప్రశ్నకు కేసీఆర్ కుండ బద్ధలు కొట్టినట్టు బదులిచ్చారు ..!
KTR : బీఆర్ఎస్ అధినేత కేసీర్ సిట్ విచారణపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సిట్ అధికారులు చట్టాన్ని గౌరవించలేదని, అయినా సరే కేసీఆర్‌ను విచారణకు సంపూర్ణంగా సహకరించారని ఆయన తెలిపారు.
KTR : బీఆర్ఎస్ అధినేత కేసీర్ సిట్ విచారణపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సిట్ అధికారులు చట్టాన్ని గౌరవించలేదని, అయినా సరే కేసీఆర్‌ను విచారణకు సంపూర్ణంగా సహకరించారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగించినట్టుగా సిట్ ప్రశ్నలు వేస్తోందని మండిపడిన ఆయన.. ప్రతి పశ్నకు కుండబద్ధలు కొట్టినట్టు కేసీఆర్ బదులిచ్చాని వెల్లడించారు. సిట్ విచారణ ఎర్రవల్లిలోనే జరిపే విషయంపై కోర్టుకు వెళ్తే తమకు అనుకులూంగా తీర్పు వచ్చేదని.. కానీ తాము అలా చేయలేదని కేటీఆర్ చెప్పారు.
కేసీఆర్ సిట్ విచారణ పూర్తయ్యాక నందినగర్‌లోని నివాసంలోనే కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో అపోహలు, అసత్యాలు సృష్టించేందుకు సిట్ విచారణను కాంగ్రెస్ సర్కార్ కొనసాగిస్తోందని కేటీఆర్ దుయ్యబట్టారు. ‘ఈ కేసులో లీకులే తప్ప అధారాలు లేవు. ఫోన్ ట్యాపింగ్ కేసులో డొల్లతనం క్రమంగా బయటపడుతోంది. ఎలాంటి తప్పు జరగలేదని తేలిపోయింది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు.
LIVE: నందినగర్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
— BRS Party (@BRSparty) February 1, 2026
‘రెండేళ్ల కాంగ్రెస్ పాలనను మూడు ముక్కల్లో చెప్పొచ్చు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడమే కాంగ్రెస్ పాలన .. కాంగ్రెస్ బీజేపీ అసమర్థత వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోంది అని ఆయన తెలిపారు. కేంద్ర బడ్జెట్లో ఈసారి కూడా అన్యాయం జరిగింది. 8+8 గుండు సున్నా అని కాంగ్రెస్, బీజేపీకి తెలుసు. డైవర్షన్, సబ్వర్షన్ పర్వర్షన్ అని కేటీఆర్ మండిపడ్డారు. ఢిల్లీకి రేవంత్ 50-60 ట్రిప్పులు కొట్టినా ఏం సాధించలేకపోయార’ని ఆయన ఎద్దేవా చేశారు. ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను గంజాయి ముఠా చంపితే పట్టించుకునే నాథుడే లేడని, మేడారం జాతరలోని వసతలు అధ్వాన్నంగా ఉన్నాయని భక్తులు అసంతృప్తి వెళ్లగక్కారని ఆయన ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనను ఖండించారు. ఇకనైనా డైవర్షన్ రాజకీయాలు ఆపేసి అభివృద్దిపై దృష్టి పెట్టాలిని.. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- KCR
- KTR
- Phone tapping
- SIT
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

