KTR: తెలంగాణ కాంగ్రెస్ పాలనలో పేద బక్కోని పొట్టగొట్టి పెద్దోళ్ల బొజ్జ నింపడమే నడుస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. హైడ్రా ఉద్యోగులకు నెలకు రూ.5 వేలు, మైనారిటీ విద్యాసంస్థల స్టాఫ్‌కు నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ వేతనంలో కోత విధించడం దారుణమన్నారు.
రూ.200 కోట్లతో అందాల పోటీలు పెట్టిన కాంగ్రెస్‌కు ఈ బక్కజీవులకు జీతమిచ్చేందుకు డబ్బు కరువైందా అని ప్రశ్నించారు. తెచ్చిన రెండున్నర లక్షల కోట్ల అప్పు ఢిల్లీ పెద్దలు, మీ అన్నదమ్ములు బొక్కడానికేనా అని నిలదీశారు. కాకుల్ని కొట్టి గద్దలకు వేయడం గురించి వినడమే కానీ తొలిసారి చూస్తున్నానని ఎక్స్‌లో పోస్టు చేశారు.
కాకుల్ని కొట్టి గద్దలకు వేయడం గురించి
వినడమే కానీ తొలిసారి చూస్తున్నాను.తెలంగాణ కాంగ్రెస్ పాలనలో
పేద బక్కోని పొట్టగొట్టి
పెద్దోళ్ల బొజ్జ నింపడమే నడుస్తోంది.హైడ్రా ఉద్యోగులకు నెలకు రూ 5,000
మైనారిటీ విద్యాసంస్థల స్టాఫ్‌కు
నెలకు రూ 10,000 నుండి రూ 15,000 వరకూ
వేతనంలో కోత… pic.twitter.com/JT4sa65Fhj— KTR (@KTRBRS) September 18, 2025