KTR | నీ ధన దాహానికి.. ఇంకా ఎన్ని ప్రాణాలు బలితీసుకుంటావో చెప్పు?: కేటీఆర్
మూసీ కూల్చివేతల భయంతో గానద శ్రీకుమార్ అనే మేస్త్రీ గుండెపోటుతో మరణించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి కట్టుకున్న ఇంటికి రూ.25 వేలు ఇస్తామని అధికారులు ప్రకటించడంపై ఫైరయ్యారు. గుండెలు ఆగిపోతున్నా, కుటుంబాలు విడిపోతున్నా సర్కార్ దాహం తగ్గడం లేదంటూ విమర్శించారు.
హైదరాబాద్: మూసీ కూల్చివేతల భయంతో గానద శ్రీకుమార్ అనే మేస్త్రీ గుండెపోటుతో మరణించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి కట్టుకున్న ఇంటికి రూ.25 వేలు ఇస్తామని అధికారులు ప్రకటించడంపై ఫైరయ్యారు. గుండెలు ఆగిపోతున్నా, కుటుంబాలు విడిపోతున్నా సర్కార్ దాహం తగ్గడం లేదంటూ విమర్శించారు. కష్టపడి పస్తులుండి పైసా పైసా కూడేసి, బ్యాంకు నుంచి అప్పు తెచ్చి కట్టిన గుడును కూల్చుతారని భయంతో ప్రాణాలు పోతున్నాయని వాపోయారు. 16 కాదు 18 మంది అయినా సరే ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉన్న కుటుంబాలను రోడ్డుకు ఈడ్చి కుటుంబాల్లో చిచ్చులు పెట్టిన మూర్కుడు రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు.
ఇండ్లు ఖాళీ చేస్తే డబుల్ బెడ్రూమ్తో పాటు రూ.25 వేల పారితోషకం అంటూ అధికారులు వెకిలి ఆఫర్లు ఇస్తున్నారని మండిపడ్డారు. కోటి ఆశలతో లక్షలు, కోట్లు వెచ్చించి కట్టుకున్న ఇండ్లకు రూ.25 వేలా అని ప్రశ్నించారు. ఓ సన్నాసి, అదే మీ అన్న ఇంటికి.. మీ మంత్రుల ఇంటికి, రూ.25 వేలు కాదు రూ.50 వేలు ఇస్తే కూల్చమంటారా ఓసారి అడుగు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఇండ్లు పోతున్నాయి అనే భయంతో ఒక బుచ్చమ్మ, ఒక కుమారన్న ప్రాణాలు పోయాయన్నారు. నీ ధన దాహానికి, నీ స్కాములకు ఇంకా ఎన్ని ప్రాణాలు బలితీసుకుంటావో చెప్పు అంటూ ఎక్స్ వేదిగా ప్రశ్నించారు.
ఆగుతున్న గుండెలు – విడిపోతున్న కుటుంబాలు, అయినా తగ్గని సర్కార్ దాహం
కలల సౌధం ఖరీదు అక్షరాల 25 వేలు!
కష్టపడి పస్తులుండి పైసా పైసా కూడేసి – బ్యాంకు నుండి అప్పు తెచ్చి కట్టిన గుడును కూల్చుతారని భయం తో పోతున్న ప్రాణాలు
16 కాదు 18 మంది అయినా సరే ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉన్న కుటుంబాలను… pic.twitter.com/pd1IxEg7SU
— KTR (@KTRBRS) October 3, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

