ప్రాంతీయ పార్టీ ప్రాతినిధ్యం ఉంటే ప్రతి బడ్జెట్లో నిధుల వరద పారుతదని పక రాష్ర్టాలకు బడ్జెట్లో కేటాయింపులను చూసి ప్రజలు గమనిస్తున్నరు. జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేవని ఈ బడ్జెట్ మరోసారి నిరూపించింది. తెలంగాణకు చిల్లిగవ్వ కూడా తేలేకపోయిన సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి.
-కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మరోసారి వచ్చింది గుండుసున్నానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రబడ్జెట్‌పై ఆదివారం ప్రకటనలో స్పందించారు. సీఎం రేవంత్, కేంద్ర మంత్రుల ఘోర వైఫల్యం కారణంగానే బడ్జెట్లో రాష్ర్టానికి అ న్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పుషరకాలంగా తెలంగాణకు రూపాయి కూడా కేటాయించలేదని, ఒక ప్రాజెక్టునూ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులు, విభజన హా మీల అమలు విషయంలో కేంద్రం పుషరకాలంగా వివక్ష కొనసాగిస్తున్నదని విమర్శించారు. ఢిల్లీ బీజేపీ పెద్దల చుట్టూ చేసిన ప్రదక్షిణలతో రాష్ర్టానికి కలిగిన ప్రయోజనమేంటో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు.
బడేభాయ్తో దోస్తీ చేసి తెలంగాణకు నిధు ల వరద పారిస్తానని ప్రగల్భాలు పలికిన చోటేభాయ్ మాటలన్నీ బూటకమేనని కేంద్ర బడ్జె ట్ సాక్షిగా తెలిపోయిందని కేటీఆర్ చురకలంటించారు. ‘తమ బడే భాయ్-చోటే భాయ్ అనుబంధంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో రాష్ర్టానికి ఏం సాధించిందో వెల్లడించాలి.. 60సార్లకు పైగా ఢిల్లీ చుట్టూ చకర్లు కొట్టినా.. ఆరు చిల్లర పైసలు కూడా తేలేని చేతగాని వ్యక్తి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండటం దౌర్భా గ్యం. రేవంత్ చేపట్టిన ఢిల్లీ టూర్లన్నీ రాహుల్ గాంధీకి మూటలు మోసేందుకు, సొంత ప్ర యోజనాలను కాపాడుకునేందుకే. చేసిన స్కామ్‌ల నుంచి తప్పించుకోడానికే కేంద్రంలోని బీజేపీ నేతల వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు తప్ప తెలంగాణ హకుల కోసం పోరాడేందుకు కాదు’ అని నిప్పులు చెరిగారు.
మరోవైపు రాష్ర్టానికి రూపాయి కూడా దక్కని ఈ బడ్జెట్‌పై బీజేపీ నేతలు ప్రజలకు వెంటనే సమాధానం చెప్పాలని కేటీఆర్ డి మాండ్ చేశారు. రాష్ట్రం నుంచి పేరుకు ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణ పక్షాన కనీ సం గొంతెత్తి అడగకపోవడం వల్లే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయింపులు జరుగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పాలమూ రు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, కొత్త రైల్వే లైన్లకు నిధులు, వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, విద్యాసంస్థల ఏర్పాటు, ఖమ్మంలో బయ్యారం ఉకు ఫ్యాక్టరీ, సిరిసిల్లలో మెగా టెక్స్టైల్ పార్ వంటి అనేక కీలక డిమాండ్లపై తాము పదేండ్లకు పైగా కేంద్రానికి అనేక విజ్ఞప్తులు చేసినా ఏ ఒకదానికీ న్యాయం చేయలేదని విమర్శించారు.
ప్రాంతీయ పార్టీకి ప్రాతినిధ్యం ఉంటే ప్రతి బడ్జెట్లో నిధుల వరద పారుతుందని, పక రాష్ర్టాలకు బడ్జెట్లో జరుగుతున్న కేటాయింపులను చూసి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేవని ఈ బడ్జె ట్ మరోసారి నిరూపించిందని స్పష్టంచేశారు. స్వీయ రాజకీయ అస్తిత్వమైన బీఆర్ఎస్కు లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే రాష్ర్టానికి తీరని అన్యాయం జరిగిందన్న విషయం తెలంగాణ సమాజానికి అర్థమైందని చెప్పారు. తెలంగాణ పార్టీ ఉంటేనే ఢిల్లీలో రాష్ర్టానికి బలం, గళం ఉంటుందన్న వాస్తవం మరోసారి రుజువైందని పేర్కొన్నారు.