చిన్నచూపేలా?
నారాయణపే ట జిల్లా కేంద్రంలో ఒకప్పుడు చిన్నారులకు వైద్యసేవలు అందించిన చిన్న పిల్లల దవాఖాన మూతపడడంతో చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నా రు. ముఖ్యంగా నవజాత శిశువులు, చిన్నారులకు అత్యవసర చికిత్స అవసరమైన సమయంలో సుమారు ఏడు కిలోమీటర్ల దూ రంలో ఉన్న జిల్లా దవాఖానకు వెళ్లాల్సి రా వడం ఆందోళన కలిగిస్తోంది.
- పేటలో మూతబడిన చిల్డ్రన్స్ హాస్పిటల్
- పట్టణానికి 7 కి.మీ. దూరంలో జిల్లా దవాఖానలో నిర్వహణ
- వెళ్లేందుకు తల్లిదండ్రులకు తప్పని తిప్పలు
- తిరిగి తెరిపిస్తామన్న ప్రజా ప్రతినిధుల హామీ ఏమైంది?
- స్థానికంగా ప్రారంభించాలని స్థానికుల నుంచి డిమాండ్లు
నారాయణపేట, ఆగస్టు 10 : నారాయణపే ట జిల్లా కేంద్రంలో ఒకప్పుడు చిన్నారులకు వైద్యసేవలు అందించిన చిన్న పిల్లల దవాఖాన మూతపడడంతో చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నా రు. ముఖ్యంగా నవజాత శిశువులు, చిన్నారులకు అత్యవసర చికిత్స అవసరమైన సమయంలో సుమారు ఏడు కిలోమీటర్ల దూ రంలో ఉన్న జిల్లా దవాఖానకు వెళ్లాల్సి రా వడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో పట్ట ణ ప్రజలతోపాటు పరిసర గ్రామాల నుంచి కూడా చిన్నారులను ఈ దవాఖానకు తీసుకొచ్చి చికిత్స చేయించుకునేవారు. అయితే దవాఖాన మూతపడిన తర్వాత ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకైనా జిల్లా దవాఖానను ఆశ్రయించాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో దూర ప్ర యాణం వల్ల విలువైన సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలోని దవాఖానను తిరిగి ప్రారంభిస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు గత ంలో హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఎ లాం టి చర్యలు కనిపించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే పిల్లలకు ప్రత్యేక వైద్య సేవలు అందిం చే దవాఖాన లేకపోవడం వల్ల జిల్లా దవాఖానపై రోగుల భారం కూడా పెరుగుతోందని స్థానికులు పేరొంటున్నారు. చి న్నారులకు తక్షణ వైద్య సేవలు అందించాలంటే మూతపడిన చిన్నపిల్లల ద వాఖానను వెంటనే పునఃప్రారంభించి, అవసరమైన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, మౌలిక సదుపాయాలను కల్పి ంచాలని ప్రజలు డిమాండ్ చే స్తున్నారు. ప్రజల ఇబ్బందులను దృ ష్టిలో ఉంచుకొని ప్ర భుత్వం, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెంటనే స్పందించి చిన్నపిల్లల దవాఖానను తిరిగి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నాయి. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తు న్నారు.
పిల్లల దవాఖాన పునఃప్రారంభించాలి
చిన్నపిల్లల దవాఖాన మూతపడడంతో అత్యవసర పరిస్థితుల్లో చిన్నారులను ఏడు కి లోమీటర్ల దూరంలోని జిల్లా దవాఖానకు తీసుకెళ్లాల్సి వ స్తోంది. దీంతో సమయం వృథా అవుతోంది. దవాఖానను తిరిగి ప్రారంభిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదు. ప్రజల ఇబ్బ ందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే చిన్నపిల్లల దవాఖానను పునఃప్రారంభించాలి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోనూ చర్చిస్తాను.
– కాకర్ల నారాయణమ్మ, పేట కౌన్సిలర్
అత్యవసర సమయాల్లో ఇబ్బందులు
చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించిన సేవలు స్థానికంగా అందుబాటులో ఉండటం అత్యంత అవసరం. దవాఖాన మూతపడడంతో తల్లిదండ్రులు అనవసరంగా దూర ప్ర యాణం చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా అత్యవసర సమ యాల్లో ఇది చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవ కాశం ఉంది. అందువల్ల అవసరమైన సిబ్బంది, సౌకర్యాలు కల్పించి చిన్నపిల్లల దవాఖానను వీలైనంత త్వ రగా తిరిగి ప్రారంభించాలి. యాభైవేలకు పైగా జనాభా ఉన్న నారాయణపేట పట ణంలో చిన్నపిల్లల దవాఖాన లేకపోవడం బాధాకరం. చిన్న పిల్లల దవాఖాన ఏర్పాటుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆందోళన చేపడతాం.
– భరత్, మున్సిపల్ కౌన్సిలర్, నారాయణపేట
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

