అప్రోచ్ రోడ్డు నిర్మించాలి
మెదక్ జిల్లా మెదక్- బొడ్మట్‌పల్లి రోడ్డుపై కొత్తపల్లి శివారులో నిర్మాణం చేసిన బ్రిడ్జికి ఇరువైపులా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ జిల్లా కొత్తపల్లి శివారులో బీఆర్ఎస్ హయాంలో నిర్మిచిన బ్రిడ్జిని ఆమె పరిశీలించి మాట్లాడారు.
- బీఆర్ఎస్ హయాంలో కొత్తపల్లి బ్రిడ్జి నిర్మాణం
- మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి డిమాండ్
మెదక్ అర్బన్, ఆగస్టు 10 : మెదక్ జిల్లా మెదక్- బొడ్మట్‌పల్లి రోడ్డుపై కొత్తపల్లి శివారులో నిర్మాణం చేసిన బ్రిడ్జికి ఇరువైపులా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ జిల్లా కొత్తపల్లి శివారులో బీఆర్ఎస్ హయాంలో నిర్మిచిన బ్రిడ్జిని ఆమె పరిశీలించి మాట్లాడారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ హయాంలో రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణం చేశారన్నారు. కేసీఆర్ కృషితో రూ. 1.40 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేసినా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీటీ రోడ్డు నిర్మాణం చేయడం లేదన్నారు.
వర్షాలు పడిన సమయంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుకు మరమ్మతులు చేయాలని వాహనదారులు పలుమార్లు కోరినా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు.బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డు నిర్మాణం చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆమె వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కొడపాక సర్పంచ్ కాశీనాథ్‌రావు, నాయకులు బద్రి మల్లేశం, సోములు, దుర్గయ్య, అనిల్‌రెడ్డి, బాబాగౌడ్, పలువురు నాయకులు ఉన్నారు.
మృతుల కుటుంబాలకు పద్మాదేవేందర్‌రెడ్డి పరామర్శ
మెదక్ జిల్లాలోని రాజిపేట, గాజిరెడ్డిపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకుల కుటుంబాలను మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆమె వారికి భరోసా కల్పించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

