KTR | సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారి ఇండ్లను కూలగొడుతామంటే.. నీ అయ్య జాగీరు కాదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళ హైడ్రా కూల్చివేతల విషయంలో హైకోర్టులో కొంత రిలీఫ్ వచ్చిందన్నారు. ‘హైడ్రా కమిషనర్ ప్రభుత్వ అధికారి అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మీరు మాట్లాడే మాటలు నేను కూడా విన్నాను. హైడ్రాను అడ్డుకుంటే భవిష్యత్‌లో హైదరాబాద్ మునిగేపోతదని మాట్లాడుతున్నరు. వీళ్లు లేనప్పుడు హైదరాబాద్ లేనే లేదు.. వీళ్లు వచ్చినంకనే హైదరాబాద్‌ను చక్కదిద్దుతున్నం అన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నరు.
మీరు విధ్వంసం చేయకపోతే చాలు. ఉన్న హైదరాబాద్‌ను ఉన్నట్లుగా ఉంచితే సరిపోతుంది. ఉన్న కంపెనీలు ఉంచండి. రియలెస్టేట్ రంగాన్ని దెబ్బతీయొద్దు. హైడ్రా దెబ్బకి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. రూ.1150కోట్లు ఉన్నది రూ.750కోట్లకి పడిపోయింది. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు భయపడుతున్నారు. అక్రమ నిర్మాణాలను మొదట్లోనే అడ్డుకోండి. 50 సంవత్సరాల కింద కట్టినవాటిని కూలగొడుతమంటే నీ అయ్యజాగీరు కాదని తెలియజేస్తున్నాం. క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తున్నాం. రేపు అంబర్‌పేట, తర్వాత ఎల్బీనగర్ సహా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తాం. పాతబస్తీలోని అన్ని ప్రాంతాల్లోనూ పర్యటిస్తాం’ అన్నారు.
‘అందరికంటే అరాచశక్తిని శ్రీధర్‌బాబు అడ్డుకోవాలి. అరాచకం అంటే అర్ధరాత్రి వెళ్లి పేదల ఇండ్లు కూలగొట్టడం. బ్రదర్‌ని కాపాడుకోవాలి.. పేదలను కొట్టిపడేయాలి. తిరుపతిరెడ్డి భద్రంగా ఉండాలి. అనుమల బ్రదర్స్ అందరూ నిక్షేపంగా ఉండాలే.. పేదలు మాత్రం రోడ్డుపై పడాలి. ఎల్బీనగర్ కొత్తపేటలో టేలాను బుల్డోజర్తో కొట్టేశారు. అది పైసాచికానందం. అరాచకం అంటే అదే. శ్రీధర్‌బాబు అంటే గౌరవం ఉండేది. నిన్నటి వ్యాఖ్యలతో ఆ గౌరవంపోయింది. కడుపు మండితే ప్రజలు తిడుతారు. మమ్మల్ని గతంలో తిట్టారు. మేం తిట్టినా పడ్డాం. మేం కట్టిన ప్రాజెక్టు ఏంటీ? కాళేశ్వరం. అందరికీ గౌరవంగా పురావాసం కల్పించాం. అందరినీ సంతృప్తి పరచడంతో ఇవాళ నీళ్లు హైదరాబాద్ వరకు వచ్చాయంటే అది కేసీఆర్ గొప్పతనం. ప్రతిపక్షం ఎంత ఇబ్బంది పెట్టినా పనులు పూర్తి చేశాం.
ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో సర్వే చేయలేదు. ఏం చేసినా దొంగచాటుగా చేసింది. ఏదో పేరు చెప్పి డ్రోన్ల ఏరియల్ సర్వే చేసింది. అసలు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలన్న రూల్ ఉన్నదని తెలుసా? వీళ్లకు.. చెంచల్‌గూడలో డబుల్ బెడ్రూంలు ప్రారంభించాం. అక్కడ కొన్ని మిగిలాయి. కొందరిని అక్కడికి పంపిస్తే అక్కడ లొల్లి అయ్యింది. ఏదైనా పద్ధతి ప్రకారం జరపాలి. అలా కాదంటే కుదరదు. మా పని మేం చేస్తాం. బీజేపోళ్లకు పట్టింపులేదు. రేవంత్ ఏం చేసినా బండి సంజయ్ జైజై అంటూ తిరుగుతున్నడు. అమృత్ స్కామ్ జరిగిందంటే కదలరూ మెదలరు. చాలా అంశాల్లో గమనిస్తున్నాం. బీజేపీ ఎంపీలు.. కాంగ్రెస్ ఎంపీలకంటే ఎక్కువ ఉత్సాహం ప్రదర్శిస్తూ రేవంత్‌రెడ్డికి తప్పెటతాళాలు వేసుకుంటూ.. బ్రహ్మాండంగా చెక్క భజన చేసుకుంటూ తిరుగుతున్నరు. వాళ్ల నుంచి ఏం ఆశిస్తాం. భారతదేశంలో అతిపెద్ద కుంభకోణం. కాంగ్రెస్ పార్టీ వచ్చే జాతీయ ఎన్నికలకు రిజర్వ్ బ్యాంక్‌గా ఈ ప్రాజెక్టును వాడుకోవాలనుకుంటున్నది’ అంటూ విమర్శించారు.