హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా(Hydraa )పేరుతో విచక్షణారహితంగా నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తున్న వైనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫైర్ అయ్యారు. హైడ్రా కూల్చి వేతలతో ప్రభుత్వం అనాగరిక చర్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. చిన్న పిల్లలు పుస్తకాలు తీసుకుంటాం అంటే కూడా సమయం ఇవ్వకుండా అధికారులు మెడలు పట్టి బైటికి నెట్టేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. చిన్న పిల్లల కళ్లముందే వాళ్ల తల్లిదండ్రులు పెట్రోల్ పోసుకుంటే.. వేదశ్రీ అనే చిన్న పాప ఆ బాధను చెప్తుంటే మనసున్న ప్రతి ఒక్కరిని ఆ సంఘటన కలిచివేసిందన్నారు.
కస్తూరిబాయి అనే మహిళ చెప్పుల దుకాణాన్ని బుల్డోజర్తో తీసి పారవేయటం అనేది మానవత్వం ఉన్న సర్కారు చేయాల్సిన పనేనా? అని ప్రశ్నించారు. సామాన్లు తీసుకుంటా అంటే కనీసం గర్భిణిలకు కూడా సమయం ఇవ్వారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(CM Revanth reddy) ఒక్కటే అడుగుతున్న. ఈ ప్రభుత్వా నికి కనీసం మానవత్వం లేదా? అని సూటిగా నిలదీశారు. హైడ్రా బాధితులకు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా తెలంగాణ భవన్కు రండి. న్యాయపరంగా, మీకు మేము అండగా నిలుస్తం. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, లీగల్ సెల్ మీకు పూర్తి అండగా నిలుస్తుందని హైడ్రా బాధితులకు భరోసా నిచ్చారు.
చిన్న పిల్లలు పుస్తకాలు తీసుకుంటాం అంటే కూడా సమయం ఇవ్వకుండా మెడలు పట్టి బైటికి నెట్టేసారు
చిన్న పిల్లల కళ్లముందే వాళ్ళ తల్లిదండ్రులు పెట్రోల్ పోసుకుంటే.. వెద్రశ్రీ అనే చిన్న పాప ఆ బాధను చెప్తుంటే హృదయ విదారక పరిస్థితి కాదా?
కస్తూరిబాయి అనే మహిళ చెప్పుల దుకాణాన్ని బుల్డోజర్ తో… https://t.co/5Hpz0yf09m pic.twitter.com/OV1bseb9DV
— Telugu Scribe (@TeluguScribe) September 25, 2024
హైడ్రా బాధితులకు మేము అండగా నిలుస్తాము
హైడ్రా బాధితులకు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా తెలంగాణ భవన్కు రండి.. న్యాయపరంగా, మీకు మేము అండగా నిలుస్తాము – కేటీఆర్ pic.twitter.com/F9rsLdAEkm
— Telugu Scribe (@TeluguScribe) September 25, 2024