హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ‘కనకపు సింహాసనమున కూర్చున్నా క.. కనకం హామీని మర్చిపోయినవా?’ అం టూ సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ‘లక్షలాదిగా లగ్గాలు జరిగే సీజన్ మళ్లీ వచ్చింది.. ఈ సారి కూడా తులం బంగారం తూచేనా ముఖ్యమంత్రీ’ అంటూ ఎద్దేవాచేశారు. ‘శుభ ముహూర్తాలతో పెళ్లి సందడి మొదలైంది.. క ల్యాణమస్తు కానుక అమలుకు సుముహూర్తం దొరకట్లేదా?’ అంటూ బుధవారం ఎక్స్‌వేదికగా ప్రశ్నించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో తులం బంగారం హామీ గురించి ప్రస్తావిస్తూ ‘10 గ్రాముల పసిడి ఆశజూపి ఆడబిడ్డల ఓట్లు వేయించుకున్నవ్.. ఆడిన మాట తప్పి పచ్చని పందిళ్ల సాక్షిగా పచ్చిదగా చేస్తున్నవ్’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘లంకె బిందెలు దొరకలేదన్న నైరాశ్యంతో నవ వధువులకు ఇవ్వాల్సిన పుత్తడిని ఎగ్గొట్టడం భావ్యమా?’ అంటూ ప్రశ్నించారు. ‘పేదింటి పెండ్లి కూతుళ్లకు టన్నుల కొద్దీ గోల్డ్ బాకీ పడ్డవ్.. ఒలింపిక్స్‌లో మోసాల పోటీలు పెడితే నీకు గోల్డ్‌మెడల్ గ్యారెంటీ.. గట్టి మేళాలు మోగుతున్నయ్.. వట్టి మాటలు ఇంకెన్నాళ్లు? గోల్డ్ షాపుల్లో స్టాక్ లేదా? బంగారు గనుల్లో తవ్వకాలు ఆగిపోయినయా?’ అంటూ దెప్పిపొడిచారు. వాగ్దానం చేసి వంచించడం మంచిది కాదని, ఆడబిడ్డలు బాధపడితే అరిష్టమని, ఈ సీజన్లోనైనా తులం బంగారం పథకాన్ని ప్రారంభించాలని కేటీఆర్ సూచించారు.