హైదరాబాద్: తనపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హైకోర్టును ఆశ్రయించారు. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసుపై క్వాష్ పిటిషన్ వేశారు. ఈ మేరకు కేటీఆర్ తరఫు లాయర్లు జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. భోజన విరామం తర్వాత పిటిషన్‌ను విచారించాలని కోరారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారించనుంది. కాగా, లంచ్ మోషన్‌ను సింగిల్ బెంచ్ తిరస్కరించడంతో.. సీజే బెంచ్ ముందు పిటిషన్‌ను దాఖలు చేశారు.
కాంగ్రెస్ సర్కార్ కుటిల ప్రయత్నంతో ఫార్ములా ఈ-కార్ రేసులో కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఈ-కార్ రేసింగ్‌లో రూ.54.88 కోట్లు దుర్వినియోగం చేశారనే అభియోగంతో కేటీఆర్‌పై ఎంఏయూడీ సెక్రటరీ దానకిశోర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్‌పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. ఎన్నికల నియమావళిని ధిక్కరిస్తూ, ప్రభుత్వ అనుమతి లేకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా రూ.54,88,87,043 కోట్లను యూకేకు చెందిన ‘ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్’ (ఎఫ్ఈఓ) కంపెనీకి హిమాయత్‌నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి బదిలీ చేయించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
ఈ మేరకు ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, ఇతరులపై కేసు నమోదు చేశారు. ఐసీపీ (బీఎన్ఎస్) 13(1)(ఏ), 13(2), సీపీయాక్ట్ 409, 120 (బీ) సెక్షన్స్ కింద అభియోగాలు మోపారు. ఈ మేరకు నాంపల్లి ఏసీబీ కోర్టుకు ఏసీబీ అధికారులు వివరణ ఇచ్చారు. రూ.10 కోట్లకు మించి బదిలీ జరిగితే ప్రభుత్వం, ఆర్థికశాఖ అనుమతి అవసరమని, సీజన్ 10 ఫార్ములా ఈ రేసింగ్‌కు స్పాన్సర్స్ లేక పోవడంతో హెచ్ఎండీఏ నిధులు మళ్లించారని, దీంతో విదేశీ కంపెనీకి చెల్లింపులతో హెచ్ఎండీఏకు అదనపు పన్ను భారమైందని దానకిశోర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.