KTR | చనాక కొరాట, సదర్మాట్ ప్రాజెక్టులు ప్రారంభోత్సవానికి సిద్ధం కావడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ప్రారంభమై.. 90 శాతానికి పైగా పనులు పూర్తి చేసుకున్న రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవాళ ప్రారంభం కావడం సంతోషదాయకమని అన్నారు.
0.98 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో నిర్మించిన చనాక కొరాట బరాజ్ బీఆర్ఎస్ హయాంలోనే 95% పనులు పూర్తయ్యి, సెప్టెంబర్ 2023లో ట్రయల్ రన్ కూడా అయ్యిందని తెలిపారు. దీనిలో భాగమైన లిఫ్ట్ ఇరిగేషన్ కాంపొనెంట్తో కలిపి, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లోని 89 గ్రామాలకు చెందిన సుమారు 51,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని పేర్కొన్నారు. 2016లో మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకుని మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇది అని చెప్పారు.
సదర్మాట్ బరాజ్ నీటి నిల్వ సార్ధ్యం 1.58 టీఎంసీలు అని.. కేసీఆర్ హయాంలోనే 90% ప్రాజెక్టు పూర్తయ్యిందని కేటీఆర్ తెలిపారు. నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని 18,000 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో #తెలంగాణదశాబ్ది (2014-2023), నెర్రెలుబారిన ఈ నేలను దేశానికి ధాన్యాగారంగా మార్చిందని అన్నారు.
కేసీఆర్ గారి హయాంలో ప్రారంభమై, 90% పైగా పనులు పూర్తిచేసుకున్న రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవ్వాళ ప్రారంభం కావడం సంతోషదాయకం:
💧చనాక కొరాట బరాజ్:
👉🏽 0.98 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో నిర్మించిన ఈ బరాజ్ బీఆర్ఎస్ హయాంలోనే 95% పనులు పూర్తయ్యి, సెప్టెంబర్ 2023లో ట్రయల్ రన్ కూడా… pic.twitter.com/hL5Z0la7EZ
— KTR (@KTRBRS) January 16, 2026