అంబేద్కర్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిన దళిత బిడ్డ, మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ముదాం సాయిలుకు బీఆర్ఎస్ భరోసాగా నిలిచింది. కామారెడ్డి జిల్లా లింగంపేటలో నిర్వహించిన ఆత్మ గౌరవ గర్జన కార్యక్రమంలో భాగంగా ఎక్కడైతే సాయిలును పోలీసులు అవమానించారో.. అదే అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సత్కరించారు. అనంతరం నాగిరెడ్డిపేటలోని సాయిలు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడే ముదాం సాయిలుతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మాజీ ఎంపీపీ సాయిలన్నకు జరిగిన అన్యాయం ఎవ్వరికీ జరగలేదని అన్నారు. దళిత వ్యతిరేకి కాంగ్రెస్ను గద్దె దించుదామని పిలుపునిచ్చారు. సాయిలన్నపై దాడికి బదులు తీర్చుకుందామని పిలుపునిచ్చారు. దళితులకు న్యాయం చేయాలని కేసీఆర్ దళిత బంధు పథకం తెచ్చారని కేటీఆర్ తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు 12 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేసిందని విమర్శించారు. 18 నెల్లో కాంగ్రెస్ పాలనలో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. దళితులకు అన్ని పనుల్లో 26 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని అన్నారు. సాయిలు బట్టలిప్పి అవమానించినట్లు.. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బట్టలు విప్పి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
దళిత మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ముదం సాయిలు ఇంట్లో భోజనం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ https://t.co/Y0iZh2zBPf pic.twitter.com/YHwZ3GX1fx
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2025
ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున పోలీసులు దళితుల పట్ల దారుణంగా ప్రవర్తించారు. లింగంపేటలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ విషయంలో నేతల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్నది. పోలీసులు అతిగా వ్యవహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాలకుల ఆదేశాలతో రెచ్చిపోయిన పోలీసులు.. దళిత నేతలపై దాష్టికాన్ని ప్రదర్శించారు. దళిత నాయకుడైన మాజీ ఎం పీపీ ముదాం సాయిలును సీఐ, ఇతర పోలీసులు టార్గెట్గా చేసుకున్నారు. ఒంటి మీద దుస్తులు ఊడిపోతున్నా పట్టించుకోకుండా ఈడ్చుకెళ్లి వాహనంలో పడేశారు. అర్ధనగ్నంగా మారిన దళిత నేతపై కనికరం కూడా లేకుండా పోలీసులు ప్రతాపం చూపించారు.
ఈ నేపథ్యంలో కాం గ్రెస్ నేతలు, పోలీసుల తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దళిత నాయకుడికి అంబేద్కర్ జ యంతి రోజునే ఎదురైన ఘోరమైన పరాభవాన్ని బీఆర్ఎస్ సీరియస్గా తీసుకున్నది. వెంటనే స్పందించిన కేటీఆ ర్ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈ నేపథ్యం లో అమానవీయ ఘటనకు నిరసనగా నేడు బీఆర్ఎస్ ఆత్మగౌరవ గర్జన నిర్వహించనున్నది.