హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత డాక్టరేట్ అందెశ్రీ (Ande Sri) అకాల మరణం పట్ల భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ మరణంపై ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తెలంగాణ సాహితీ లోకానికి, రాష్ట్రానికి తీరని లోటన్నారు. అందెశ్రీ మరణంతో శోకసముద్రంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్ ప్రార్థించారు.
డా. అందెశ్రీ మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సంతాపం
ప్రముఖ కవి, రచయిత, డా. అందెశ్రీ గారి అకాల మరణం పట్ల భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అందెశ్రీ మరణం పట్ల విచారం తెలుపుతూ, కేటీఆర్ గారు తన ప్రగాఢ సంతాపం… pic.twitter.com/83SCyPDTHI
— BRS Party (@BRSparty) November 10, 2025