ఉద్యమ పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం అనేకసార్లు పదవులను త్యజించినం. తెగించి కొట్లాడి గమ్యాన్ని ముద్దాడినం. అన్ని రంగాల్లో అట్టడుగున ఉన్న రాష్ర్టాన్ని అన్నింటా ముందు నిలిపినం. కాళేశ్వరంలాంటి మహత్తర ప్రాజెక్టు నిర్మించి గోదావరి నీళ్లను బీళ్లకు మళ్లించినం. 17 నెలల కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపినం. ప్రజల పక్షాన పోరాడినం. హైడ్రా, మూసీ బాధితులకు అండగా నిలిచినం. హెచ్‌సీయూ, లగచర్ల వంటి అంశాల్లో బాధితుల పక్షాన కొట్లాడినం. అందుకే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతున్నది. మళ్లీ అధికారంలోకి వస్తామనే ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నది.
– కేటీఆర్
KTR | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ‘వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న పండుగలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించి చరిత్ర సృష్టిస్తాం. సభ కోసం కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసినం. తెలంగాణ ఇంటి పార్టీ నిర్వహిస్తున్న జనజాతరకు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు హాజరై విజయవంతం చేయాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పిలుపునిచ్చారు. ఈ సభలో కేసీఆర్ చేసే ప్రసంగం కోసం యావత్ తెలంగాణ సమాజం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నదని చెప్పారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా సభలను నిర్వహించడంలో బీఆర్ఎస్, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు ఇప్పటికే పేరున్నదని, ఇప్పుడు మరో చారిత్రక సభను వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో నిర్వహించబోతున్నామని తెలిపారు. ఆదివారం తెల్లవారగానే పల్లెలు, కాలనీల్లో బీఆర్ఎస్ పార్టీ బాధ్యులు గులాబీ జెండాలను ఎగురవేసి వాహనాల్లో బయల్దేరాలని సూచించారు. తాను కూడా తెలంగాణభవన్‌లో జెండా ఎగురవేసి బయల్దేరి వెళ్తానని చెప్పారు. రజతోత్సవ సభ ప్రాంగణానికి ఐదు వైపులా దారులు ఉన్నాయని వివరించారు. వివిధ ప్రాంతాల వారు తమ సమీప దారులను ఎంచుకొని సమయానికి చేరుకోవాలని సూచించారు. పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో కేటీఆర్ శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సభ నిర్వహణ తీరుతెన్నులు, ఏర్పాట్లను వివరించారు. 25 ఏండ్ల ప్రస్థానంలో పార్టీ సాధించిన విజయాలు, తగిలిన ఎదురుదెబ్బలు, ఎదుర్కొన్న ఆటుపోట్లు, పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ ప్రణాళికలు, ప్రతిపక్షంగా చేసిన పోరాటాలు, సమస్యలను ఎలుగెత్తిచాటిన తీరును సోదాహరణంగా వివరించారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు
కేటీఆర్: 2001లో పురుడు పోసుకున్న బీఆర్ఎస్ ఏప్రిల్ 27న 24 ఏండ్లు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నది. ఆనవాయితీ ప్రకారం వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో బ్రహ్మాండమైన సభ నిర్వహించాలని నిర్ణయించినం. ఈ సభ చరిత్రలో గొప్ప సభల్లో ఒకటిగా నిలుస్తుంది. పార్టీ అధినేత కేసీఆర్ డైరెక్షన్లో 1,300 ఎకరాల్లో అన్ని ఏర్పాట్లు చేసినం. ఇందులో దాదాపు 900 ఎకరాలు పార్కింగ్‌కు కేటాయించినం. మిగిలిన 400 ఎకరాల్లో సభ నిర్వహిస్తాం. సభకు వచ్చేవారికి సేవలందించేందుకు 1,500 మంది వలంటీర్లను నియమించినం. 10 లక్షల చొప్పున మంచినీళ ్లబాటిళ్లు, చల్ల ప్యాకెట్లకు ఆర్డరిచ్చినం. 250 జనరేటర్లు, 200 మొబైల్ పెట్రోలింగ్ వాహనాలు, 250 సీసీ కెమెరాలు అమర్చినం. తాత్కాలిక కంట్రోల్ కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసినం. 200 వైర్లెస్సెట్లు అందుబాటులో ఉంచినం. గూగుల్ ట్రాన్స్‌లొకేషన్ మ్యాపుల ఆధారంగా ప్రవేశమార్గాలు ఏర్పాటు చేసినం. మూడు వేల బస్సులను అందుబాటులో ఉంచినం. వాహనాలు చెడిపోతే, ఆగిపోతే తీసుకెళ్లేందుకు 25 టోయింగ్ వెహికిల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నందున సభను సాయంత్రం 5:00 గంటలకు మొదలు పెడతం. కేసీఆర్ గులాబీ జెండాను ఆవిష్కరించిన తర్వాత తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. తదనంతరం అమరులవీరులకు నివాళులర్పిస్తారు. వచ్చివవారందరూ చీకటి పడకముందే ఇండ్లళ్లకు చేరుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
కేటీఆర్: కేసీఆర్ చేసే ప్రసంగం కోసం యావత్ తెలంగాణ సమాజం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నది. మళ్లీ అందరూ టీవీలకు అతుక్కుపోయే పరిస్థితి. మేం కూడా ఆయన ఏం చెప్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నం. పొరుగు రాష్ర్టాల ప్రజలు సైతం అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు. గొప్పగా నిర్వహించే సభ ద్వారా కేసీఆర్ కచ్చితంగా రాష్ట్ర దశ, దిశను నిర్దేశిస్తారనే విషయంలో ఎంతమాత్రం సందేహంలేదు.
కేటీఆర్: ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో తరలివస్తారు. కానీ, ఎక్కువగా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల నుంచి వస్తారు. ఈ జిల్లాలతో పోల్చుకుంటే ఇతర జిల్లాల నుంచి కొద్దిగా తక్కువగా వస్తారని భావిస్తున్నాం.
కేటీఆర్: మా పార్టీకి వివిధ దేశాల్లో ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. అక్కడ కూడా ఘనంగా వేడుకలు జరుగుతాయి. పార్టీ ముఖ్యనేతలు హాజరవుతారు. రాష్ట్రంలోనూ పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తం. ఇందుకోసం పూర్తిస్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తం. జిల్లాలవారీగా, నెలలవారీగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని యోచిస్తున్నాం. త్వరలోనే అన్ని విషయాలు చెప్తాం. మధ్యలో స్థానిక ఎన్నికలు వస్తే దీటుగా ఎదుర్కొంటం. ప్రజల్లోకి వెళ్లి సత్తాచాటుతాం.
కేటీఆర్: సభ ముగిసిన ఒకటి రెండు రోజుల్లో పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడతం. పార్టీ రాజ్యాంగం ప్రకారం ప్రతి నాలుగేండ్లకోసారి కార్యవర్గాన్ని ఎన్నుకుం టం. మే నెలలో సభ్యత్వ నమోదు ప్రారంభించి ఆగస్టులోగా పూర్తిచేస్తాం. తర్వాత వివిధ స్థాయు ల్లో కమిటీలను ఎన్నుకుంటం. అక్టోబర్‌లో అధ్యక్షుడిని ఎన్నుకుంటం. ఇందుకు పార్టీలోని ఎవరైనా పోటీపడవచ్చు.
కేటీఆర్ : అలా అని ఎందుకు అనుకుంటారు? మాకు పూర్తి స్థాయిలో రాష్ట్ర కమిటీ ఉన్నది. జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు. నియోజకవర్గాల ఇన్చార్జీలు ఉన్నారు. మిగతా పార్టీలకు మాకు తేడా ఏంటంటే.. ప్రతి నియోజకవర్గ బాధ్యుడే స్టేట్ కమిటీ మెంబర్‌గా ఉన్నాడు. తెలంగాణ వచ్చాక మేము కొట్లాడింది మూడు ఎన్నికలు. వాటిల్లో మా పనితీరు చూడండి. రెండు జీహెచ్ఎంసీ ఎన్నికలు కొట్లాడాం. గతంలో 32కి 32 జిల్లా పరిషత్‌లు గెలిచాం. 143 మున్సిపాలిటీలకు 136 గెలిచాం. మేము సంస్థాగతంగా బలంగా లేకపోతే ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి?
కేటీఆర్: ఎందుకు లేదు? గ్రామాల్లో మాకు కావల్సినంత బలం ఉన్నది. కొన్ని పార్టీలను క్యాడర్ బేస్డ్ పార్టీలని చెప్తారు. సొంతంగా, పొత్తులు లేకుండా ఒక్క ఎలక్షన్ గెలిచారా? తమిళనాడులో రెండు పార్టీల్లో ఒకసారి వాళ్లు గెలిస్తే.. మరోసారి వీళ్లు గెలుస్తారు. క్యాడర్ చాలా ముఖ్యమే కానీ, ఒక్కోసారి క్యాడర్ గెలుస్తామనే నమ్మకాన్ని ఇవ్వకపోవచ్చు. పార్టీ నిర్మాణం చాలా ముఖ్యం. ఉద్దేశాలు, ట్రెండ్, మూడ్ అన్నీ పరిగణనలోకి వస్తాయి. మేము గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయాం. క్యాడర్ బేస్డ్ పార్టీలని చెప్పుకుంటున్న వారితో పోల్చితే మేము చాలా ఉన్నత స్థాయిలోనే ఉన్నాం.
కేటీఆర్: మేం ఎన్రోల్మెంట్ చేయలేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్నైన నేను కూడా ఓటు నమోదు చేసుకోలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికతో గవర్నమెంట్ మారేది లేదు. పెద్దగా ప్రయోజనమేమీలేదు. అందుకే దూరంగా ఉన్నం. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేంత బలం మాకు లేదు. ఈ పరిస్థితుల్లో ఓటింగ్‌ను బహిష్కరించినం. అయినా ఎన్నికల్లో పాల్గొననంత మాత్రాన ఏదో అయిపోతుందని అనుకోవడం అపోహే. మన కండ్ల ముందే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు బలవంతంగా స్థానిక సంస్థల్లో పోటీ చేస్తే ఏమైంది? ఆయన సొంతూరు కుప్పంలో కూడా ఆశించిన ఫలితం రాలేదు. కానీ, ఏమైంది? అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించలేదా? మేం కూడా కొన్ని సందర్భాల్లో వ్యూహాత్మకంగానే ఎన్నికలకు దూరంగా ఉంటున్నం.
కేటీఆర్: తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నరు. ఏడాదిన్నర కావస్తున్నా బీద అరుపులు అరుస్తున్నరు. ఆయన ఎవరినీ గుర్తించడంలేదు. ఆయనను ఎవరూ గుర్తుపట్టడంలేదు. ఒకాయేనేమో ఉత్తమ్ ముఖ్యమంత్రి అంటడు. ఇంకొకాయన పొంగులేటి పేరు చెప్తాడు. మరో ఎమ్మెల్యే తుమ్మల మా సీఎం అంటున్నడు. వారి పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను ముఖ్యమంత్రి అంటున్నరు. వాళ్లు అధికారంలో ఉన్నామా? ప్రతిపక్షంలో ఉన్నామా? అనే కన్ఫ్యూజన్లో ఉన్నరు. అందుకే మీడియాకు వాళ్లు ప్రతిపక్షంలా కనబడుతున్నరు. వాళ్లడిగిన ప్రశ్నలకు దీటుగా బదులిస్తున్న మమ్మల్ని అధికార పక్షం అనుకుంటున్నరు అంతే.
కేటీఆర్: ప్రజలకు భరోసా ఇవ్వగలిగినం. ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపినం. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటిగా వ్యవహరిస్తున్నా ఒంటరిగా ప్రజా సమస్యలపై పోరాడినం. ప్రజలు తమ కష్టాలు చెప్పుకొనేందుకు ఓ వేదిక ఉన్నదనే భావన కలిగింది. ఈరోజు తెలంగాణభవన్ జనతాగ్యారేజీగా మారింది. హైడ్రా, మూసీ బాధితులు, ఆటో డ్రైవర్లు, ఆపదలో ఉన్న రైతులు మా తలుపుతడుతున్నరు. న్యాయపరంగానో, ఏదోవిధంగానో అండగా ఉండాలని కోరుతున్నారు. లగచర్ల లంబాడా గిరిజన రైతుల తరుఫున అలుపెరగని పోరాటం చేసినం. అందుకు గర్వపడుతున్నం. సమస్యను ఢిల్లీ స్థాయిలో జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినం. ఇటీవలే ఎన్హెచ్ఆర్సీ కూడా ప్రభుత్వానికి మొట్టికాయలేసింది. ఇది బీఆర్ఎస్ విజయం కాదా? హెచ్‌సీయూ విషయంలో దేశం దృష్టిని ఆకర్షించగలిగినం. సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ కూడా ఇందులో ఆర్థిక అక్రమాలు ఉన్నాయని తేల్చి విచారణ జరిపించాలని నివేదించింది. ఇది బీఆర్ఎస్ ఘనత కాదా? అలాగే అనేక ఎదురుదెబ్బలు తగిలినయ్. పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినం, కవిత అరెస్టు, కేసీఆర్ గాయపడటం, పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించడం. కానీ, ఇవేవీ శాశ్వతం కాదు. ప్రజల కోసం పోరాడినప్పుడే ప్రజాస్వామ్యంలో విజయం వరిస్తుంది.
కేటీఆర్: వాళ్లను వెనక్కి తీసుకోవద్దన్నదే నా వ్యక్తిగత అభిప్రాయం. ఫిరాయింపు ఎమ్మెల్యేలను తీసుకుంటే మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి. ఒకవేళ తీసుకోవాల్సిన సందర్భం వస్తే, పార్టీగా అందరం కూర్చొని నిర్ణయం తీసుకోవాలి. వ్యక్తిగతంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లను తీసుకోవద్దనే చెప్తా. ఎందుకంటే, అది మా కార్యకర్తలకు అవమానం. వాళ్లు వెళ్లిన తర్వాత పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలు, నాయకుల అభిప్రాయమే మాకు ముఖ్యం.
కేటీఆర్: మస్తు వచ్చినయ్. చాలామంది ఆసక్తి చూపుతున్నారు కూడా. కానీ, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం వాళ్లను పార్టీలోకి మళ్లీ తీసుకోవద్దనే చెప్తా. ఇది పెద్ద పార్టీ కదా. తెరిచిన ద్వారంలాగా.. ఎప్పుడంటే అప్పుడు వెళ్లడం.. రావడం కుదరదు. ఇదేం పద్ధతి? పోయినోడు పోయిండు.. కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చి, రెండుమూడు దశాబ్దాలకు సరిపడా మంచిగా నాయకత్వాన్ని తయారు చేసుకుంటాం. ఇదిమాకు అరుదైన అవకాశం.
కేటీఆర్: ప్రస్తుతానికి అలాంటి చర్చ ఏమీ లేదు. ఇలాంటి సందర్భాలు వస్తే కేసీఆర్ కూడా పార్టీలో అందరి అభిప్రాయం తీసుకునే నిర్ణయాలు తీసుకుంటారు. అనేక ఉదాహరణలున్నాయి. 2009లో కేసీఆర్ పీఆర్పీతో పొత్తు పెట్టుకోవాలని అన్నారు. మా పార్టీలో కొంతమంది టీడీపీతో పొత్తు పెట్టుకుందామని చెప్పారు. మెజారిటీ నిర్ణయం ప్రకారం టీడీపీతోనే పొత్తు పెట్టుకున్నాం. కేసీఆర్ ప్రజాస్వామ్యవాది. పార్టీలో, రాష్ట్ర కమిటీలో, ఎంపీలు, ఎమ్మెల్యేల్లో మెజారిటీ అభిప్రాయం తీసుకుంటారు. తప్ప.. సొంతంగా ఇలాంటి వాటిపై నిర్ణయాలు తీసుకోరు.
కేటీఆర్: ఇట్లాంటి సున్నితమైన అంశాన్ని రాజకీయం చేయాలనుకోవడం నీచమైన చర్య. నీచమైన నాయకులు మాత్రమే ఇట్లాంటి ఘటనలను రాజకీయం చేస్తారు. మాకు ఆ ఖర్మ పట్టలేదు. మేము ఎన్నడూ ధర్మాన్ని రాజకీయం చేయలేదు. యాదగిరిగుట్టలో రూ.1,800 కోట్ల ప్రభుత్వ డబ్బుతో దేశంలోనే అద్భుతమైన ఆలయం కట్టిన ఏకైన నాయకుడు కేసీఆర్. మేము స్పిరిచువల్లీ హిందూ.. నాట్ పొలిటికల్ హిందూస్. ఇట్లాంటి సమయంలో ప్రభుత్వానికి, దేశానికి అండగా నిలబడటం దేశభక్తి.
కేటీఆర్: మొన్నటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్లు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొనే ఓట్లు వేసుకున్నారు కదా. వాళ్లు వాళ్లు కలిసిపోయారు కదా. ఇందులో మా బంధం ఏమున్నది?
కేటీఆర్: అసలు ప్రభుత్వం ఎన్నికలు పెడుతుందా? జీహెచ్ఎంసీని ఏం చేస్తున్నదనే విషయంలో స్పష్టత లేదు. ఒకసారి మూడు ముక్కలు చేస్తామంటున్నరు. విభజించినా మళ్లీ డీలిమిటేషన్ చేయాలి. సాంకేతిక చిక్కులు కూడా వస్తాయి. వారి చేతిలో అధికారం ఉన్నది. ఏం చేస్తారో చూడాలి. ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే తప్పకుండా పోటీ చేస్తాం. ప్రజల్లోకి వెళ్లి మా బలమేంటో నిరూపించుకుంటం.
కేటీఆర్: మేడిగడ్డలో ఒక ఘటన జరిగిందనగానే ఆగమేఘాల మీద 24 గంటల్లో ఎన్డీఎస్ఏ పరుగుపరుగున వచ్చింది. రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ రాష్ట్ర నేతలు మేడిగడ్డలోని ఓ పిల్లర్‌లో పగులు వచ్చిందని దుష్ప్రచారం చేశారు. మరి ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయినా… సుంకిశాల రిటైనింగ్ వాల్ దెబ్బతిన్న సందర్భంలో ఎన్డీఎస్ఏ ఎటుపోయింది? వట్టెంలో పంపుహౌస్ మునిగిపోయింది.. కేంద్రం నుంచి ఒక్క ఏజెన్సీ వచ్చిందా? పెద్ద వాగు కొట్టుకునిపోయిందని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా అడిగారా? కేసీఆర్, బీఆర్ఎస్పై ద్వేషంతో కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న పనులతో తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు. ఎన్డీఎస్ఏ తుది రిపోర్టు గత సంవత్సరం డిసెంబర్లో వస్తే.. ఈ నెల 24, 25న ఎందుకు విడుదల చేశారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఉన్నదనగానే బీఆర్ఎస్ను బద్నాం చేసే కుట్రలో భాగంగానే బీజేపీ వండివార్చి ఎన్డీయే రిపోర్టును విడుదల చేసింది. బీహార్‌లో రోజుకో బ్రిడ్జి కూలితే ఎన్డీఎస్ఏ ఎందుకు ఒక్క రిపోర్టు ఇవ్వడం లేదు. గుజరాత్‌లోని మోర్బి బ్రిడ్జి కూలి 140 మంది చనిపోతే ఏ రిపోర్ట్టూ లేదు. బీహార్, గుజరాత్‌కు రూల్స్ ఉండవా? రాజకీయ ప్రేరేపితంలో భాగంగానే ఎన్డీఎస్ఏ రిపోర్టు తయారుచేశారు.
కేటీఆర్: ఈ ప్రభుత్వం ఇచ్చినమాట తప్పిందని సీఎం రేవంత్‌రెడ్డిపై మా కార్యకర్త పోస్టు పెడితే.. సైబర్‌క్రైమ్ బ్యూరోలో పనిచేసే కానిస్టేబుల్ తన మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కేసు పెట్టాడు. పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తీస్తాం. పోలీసులు ఎక్కడ ఏం చేస్తున్నారో మాకు అంతా తెలుసు. భూదాన్ భూముల్లో ఏం చేస్తున్నారు.. ముగ్గురు పోలీసు అధికారులు విల్లాలు కడుతున్నారని పత్రికల్లో వచ్చింది. అన్నింటినీ వెలికి తీసే సమయం వస్తుంది. రీ పోస్టు చేస్తే కేసులు పెడతారా? హెచ్‌సీయూలోకి బుల్డోజర్లు పంపి అరాచకం చేసింది ప్రభుత్వం.. కేసు పెడితే సీఎం రేవంత్‌రెడ్డిపై పెట్టాలి.
కేటీఆర్: కేసీఆర్ నాయకత్వంలో పుట్టి టీఆర్ఎస్గా ఒక విజయం సాధించి.. బీఆర్ఎస్గా మారిన పార్టీగా ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. అయినా మా పార్టీ పండుగ మేము చేసుకుంటే కాంగ్రెస్ వాళ్లకు వచ్చిన బాధ ఏంటీ..? కాంగ్రెస్ నాయకులు ముందు పాలనపై దృష్టి పెట్టి ప్రభుత్వాన్ని నడపాలి.
కేటీఆర్: ముమ్మాటికీ కాంగ్రెస్సే. బీజేపీకి తెలంగాణలో స్థానంలేదు. ఇది అనేక సందర్భాల్లో రుజువైంది. ఆ పార్టీ కేవలం పార్లమెంట్ ఎన్నికల్లోనే కొంత మెరుగైన స్థానాలు సాధిస్తుంది. అది కూడా మోదీ హవాతోనే. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎనిమిది మంది మాత్రమే గెలువడం ఇందుకు నిదర్శనం. ఆ పార్టీకి చెందిన హేమాహేమీలుగా భావిస్తున్న బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్, కిషన్‌రెడ్డి, అర్వింద్, రఘునందన్‌రావును అసెంబ్లీ ఎన్నికల్లో మట్టి కరిపించింది బీఆర్ఎస్సే. అసెంబ్లీ ఎన్నికల్లో గెలువని వారు ఇతర అభ్యర్థులను గెలిపిస్తారా? అది సాధ్యమయ్యే పనికాదు.
కేటీఆర్: కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. ప్రతిరోజూ తనను కలవడానికి వచ్చే 50 నుంచి 100 మందితో మాట్లాడి వారి సాధకబాధకాలు తెలుసుకుంటున్నారు. నిత్యం ప్రెస్మీట్లు పెడితేనే నాయకులు ప్రజల మధ్య ఉన్నట్టా? తన నియోజకవర్గంలోనే కేసీఆర్ ఉంటున్నారు కదా? ఢిల్లీ లేదా చెన్నైలో ఉండటం లేదు. హైదరాబాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో గజ్వేల్‌లో ఉంటున్నారు.
కేటీఆర్: ఒక జాతీయ పార్టీని నమ్మి ఇప్పటికే మోసపోయాం. మరో ఢిల్లీ పార్టీని నమ్మితే భవిష్యత్తులో పూర్తిగా మోసపోతాం. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఢిల్లీ పార్టీలు. దొందూదొందే. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా జరిగిందా? ఆ పార్టీ నాయకులు చెప్పాలి. మన ఇంటి పార్టీని, తెలంగాణ గొంతుకను ప్రజలు కాపాడుకోవాలి.
కేటీఆర్: ఉద్యమ పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం అనేకసార్లు పదవులను త్యజించినం. తెగించి కొట్లాడి గమ్యాన్ని ముద్దాడినం. ప్రజలు మా చిత్తశుద్ధిని గుర్తించి అధికారమిచ్చారు. గతంలో దేశంలో ఒక్క జార్ఖండ్ ముక్తి మోర్చాకు మాత్రమే ఈ ఘనత దక్కింది. ఆ తర్వాత బీఆర్ఎస్కే అవకాశం వచ్చింది. అధికారాన్ని హోదాగా కాకుండా బాధ్యతగా భావించినం. తొలినాళ్లలో ఎదురైన అనేక ఇక్కట్లను అధిగమించినం. ప్రజా సమస్యల పరిష్కారానికి దారి చూపినం. అన్ని రంగాల్లో అట్టడుగున ఉన్న రాష్ట్రాన్ని అన్నింటా ముందు నిలిపినం. తలసరి ఆదాయం, జీఎస్డీపీలో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దినం. కాళేశ్వరంలాంటి మహత్తర ప్రాజెక్టు నిర్మించి గోదావరిని బీళ్లకు మళ్లించినం. ఇప్పుడు ప్రతిపక్షంలోనూ మరింత బాధ్యతగా వ్యవహరిస్తున్నం. 17 నెలల్లో సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపినం. ప్రజల పక్షాన పోరాడినం. హైడ్రా, మూసీ బాధితులకు అండగా నిలిచినం. హెచ్‌సీయూ, లగచర్ల వంటి అంశాల్లో బాధితులపక్షాన కొట్లాడినం. అందుకే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతున్నది. మళ్లీ అధికారంలోకి వస్తామనే ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నది.
కేటీఆర్: బీజేపీతో పొత్తు పెట్టుకునే ఖర్మ మాకేం పట్టలేదు. అవసరం అంతకంటే లేదు. ఒక పార్టీగా వాళ్లే రోజురోజుకూ దిగజారిపోతున్నారు. 2014లో మాకు 63 సీట్లు వచ్చాయి. అదే సమయంలో మోదీ 278కిపైగా సీట్లు సాధించారు. రెండోసారి మాకు 88 సీట్లు వచ్చాయి. మోదీకి 303 సీట్లు వచ్చాయి. మొన్నటి ఎన్నికల్లో మాకు 39 వచ్చాయి. మోదీకి 240 వచ్చాయి. మోదీ నైతికంగా ఓడిపోయారు. మేమూ ఓడిపోయాం. ఆయన పొత్తుతో అధికారంలోకి వచ్చారు. దేశంలో మోదీ, బీజేపీ ప్రభ రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతుంది. కేంద్రంలోనే వాళ్ల పరపతి తగ్గుతున్నప్పుడు వారితో పొత్తు మాకెందుకు? పదేండ్లలో తెలంగాణకు ఏమీ చేయనివాళ్లు.. తెలంగాణలో ఓట్లు ఏమని అడుగుతారు. గుడికట్టారా? బడి కట్టారా? ఓ కాలేజీ ఇచ్చారా? పరిశ్రమ తెచ్చారా? ఇక్కడ్నుంచి తీసుకున్నదే తప్ప.. వాళ్లు చేసింది ఏమున్నది?
కేటీఆర్: మన దేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రం ఏది బాగున్నదో చెప్పండి? కేసీఆర్ నాయకత్వంలో సింగిల్ ఇంజిన్ సర్కార్ కంటే.. ఏ డబుల్ ఇంజిన్ సర్కార్ మెరుగ్గా పనిచేసిందో చెప్పాలి? అలా చెప్తే.. మేము కూడా నేర్చుకుంటాం.
కేటీఆర్: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రేవంత్‌రెడ్డి దుర్భాషలు, దిక్కుమాలిన మాటలు వినాల్నా? కేసీఆర్ అభిమానిగా, పార్టీ కార్యకర్తగా నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ట్రంప్ కార్డు లాంటి వాళ్లు. అసెంబ్లీలో బజారుభాష మాట్లాడే సీఎం రేవంత్‌రెడ్డికి గట్టిగా సమాధానం ఇవ్వడానికి నాతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కేసీఆర్‌లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండాలి. లగచర్ల, హెచ్సీయూలాంటి అంశాల్లో మాకు మార్గనిర్దేశనం చేస్తున్నది కేసీఆరే. కేఆర్ఎంబీకి కాంగ్రెస్ ప్రభుత్వం దాసోహం అయితే నల్లగొండలో కేసీఆర్ గర్జిస్తే ఒక్క రోజులో పరిస్థితి మారిపోలేదా? 46-47 ఏండ్ల రాజకీయ అనుభవం కేసీఆర్ సొంతం. ఎన్టీఆర్, జయలలిత, కరుణానిధిలాంటి వాళ్లు చాలా సందర్భాల్లో అసెంబ్లీలో కాలు పెట్టలేదు. మా పోరాటాలకే సీఎం రేవంత్‌రెడ్డి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్‌రెడ్డి అసెంబ్లీ నుంచి పారిపోవడం ఖాయం.
కేటీఆర్: రేవంత్‌రెడ్డికి పరిపాలన చేతనైతలేదు. ముఖం బాగలేక అద్దం పగలగొట్టినట్టుంది. పాలన చేతగాక పక్కనోళ్ల మీద దుమ్మెత్తిపోస్తుండు. ఎన్నిరోజులు తప్పించుకుంటారు? హామీలు ఇచ్చినప్పుడు వాళ్లు అసెంబ్లీలో లేరా? మేము అసెంబ్లీలో అప్పుల లెక్కలు చెప్పినప్పుడు లేరా? కాగ్ నివేదిక ఇచ్చినప్పుడు లేరా? మీదసలు పొలికల్ పార్టీనా? లేక సర్కస్ కంపెనీనా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే హామీలు ఇస్తారా? మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌కు ఇవి తెల్వదా? భట్టి విక్రమార్కకు, నాటి పీసీసీ చీఫ్‌కు, సునీల్ కనుగోలుకు తెల్వదా? అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. పాలన చేతగాక అప్పులో అప్పులో అని అంటున్నారు. అప్పులు చేసిన రాష్ర్టాల్లో కింది నుంచి 5వ స్థానంలో తెలంగాణ ఉన్నట్టు మొన్న పార్లమెంట్‌కు ఇచ్చిన నివేదిక చెప్పింది. అప్పులపై వాళ్లు చేసే ప్రచారం తప్పని శాసనసభలో చెప్పాం. మేము ఏడాదికి రూ.41 వేల కోట్ల అప్పు చేస్తే.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఏడాదికి రూ.లక్షా 60 వేల కోట్లు అప్పు చేసిండు. మాతో పోల్చుకుంటే నాలుగు రెట్లు. మొన్న బడ్జెట్లో కూడా మనది మిగులు రాష్ట్రం అని భట్టి విక్రమార్క చెప్పారు. అప్పులు, మిత్తీలు కట్టంగ, సబ్సిడీ, జీతాలు, పెన్షన్లు ఇవ్వంగా ఇంకా డబ్బులు మిగిలే ఉన్నాయని చెప్పారు. మిగులు రాష్ట్రమని మీరే చెప్పి.. అప్పుల వడ్డీలు కట్టడం కోసం అప్పులు చేస్తున్నామని చెప్పడం తప్పు కాదా? బడ్జెట్లో మీరే గొప్పగా చెప్తారు. బయటికొస్తే మీరే బీద అరుపులు అరుస్తారు. రూపాయిలో 47 పైసలు కమిటెడ్ ఎక్స్పెండేచర్ అని సోషియో ఎకనామిక్ బుక్‌లో చెప్పారు. సీఎంకు ఇవ్వన్నీ తెల్వదు. ఆయనకు పాలనా అనుభవం లేదు. ఎవరో రాసిస్తారు.. ఆయన చదివేస్తారు.
కేటీఆర్: కాంగ్రెస్ ఎన్నిసార్లు పేర్లు మార్చుకున్నది. బీజేపీ ఎన్నిసార్లు పేర్లు మార్చుకున్నది. ఇందిరా కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్.. ఇలా ఎన్నోసార్లు మార్చుకున్నది. అలాగే బీజేపీ కూడా. అసలు పేరు ఎందుకు మారిందంటే.. రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి.. తెలంగాణ చేపట్టిన కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా మారుతున్నాయి. రైతుబంధు, మిషన్ భగీరథ వంటివి ఎన్నో రూపాల్లో దేశమంతా ఉన్నాయి. రెండోది మహారాష్ట్రలో బీఆర్ఎస్ నుంచి ఎంతోమంది సర్పంచ్‌లు గెలిచారు. తమ గ్రామాలను తెలంగాణలో కలుపండి అంటూ మొరపెట్టుకున్నారు. భవిష్యత్ అంతా సంకీర్ణ ప్రభుత్వాలే కదా.. అలాంటప్పుడు మనమెందుకు 25-30 ఎంపీ సీట్లు తెచ్చుకొని కేంద్రంలో కీలకంగా మారకూడదనుకున్నాం. తెలంగాణ పవర్, సత్తా దేశానికి ఎందుకు చాటొద్దు అని అనుకున్నాం. మారింది పేరే కదా.. ఆ సత్తా అలాగే ఉంది కదా. టీఆర్ఎస్ అనే పేరు మీద మహారాష్ట్రలోనో, ఇతర రాష్ర్టాల్లోనో పోటీ చేయలేం కదా. ఒకవేళ చేస్తే.. అది తెలంగాణ పార్టీ అంటారు. అందుకే సాంకేతికంగా పేరు మార్చుకున్నాం. మా నాయకుడు మారలేదు. గుర్తు మారలేదు. జెండా, అజెండా మారలేదు. మొదటి ప్రయత్నంలో విఫలం అయ్యామేమో కానీ, విజయాన్ని తప్పకుండా ముద్దాడతాం. ఒక ఎదురుదెబ్బకే వెనక్కి పోతే.. తెలంగాణ వచ్చేదే కాదు కదా! మాకు ఇదే పేరుకి 37% మంది ఓట్లు వేశారు కదా. కేవలం 1.8% ఓట్ల తేడాతోనే కదా ఓడిపోయింది. 14 చోట్ల ఆరు వేల కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం. జుక్కల్‌లో 1,100 ఓట్లు, దేవరకద్రలో 1,300 ఓట్లతో, కాగజ్‌నగర్, ఆదిలాబాద్, బోధన్ వంటి చోట్ల సుమారు 3,000 ఓట్లతో ఓడియాం. సామాన్యుల్లో బీఆర్ఎస్, టీఆర్ఎస్ అనే మీమాంస లేదు. గులాబీ జెండా అంటే.. తెలంగాణ పార్టీ అంతే. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడం మా మొదటి లక్ష్యం. ఇంట గెలిచి రచ్చ గెలుస్తాం.
కేటీఆర్: మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం.. కాంగ్రెస్ విధానం. మా ప్రభుత్వ హయాంలో లక్షా 60 వేల మం దికి ఉద్యోగాలు ఇచ్చి కూడా ప్రచారం చేసుకోలేకపోయాం. ఏడాదికి 16 వేల ఉద్యోగాలు ఇచ్చాం. అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు ఇవ్వలేదు. పదేండ్లలో ఆరున్నర లక్షల రేషన్‌కార్డులు ఇచ్చాం. ఉద్యోగులకు 73% జీతాలు పెంచాం. రైతులకు రూ.73 వేల కోట్ల రైతుబంధు అందజేశాం. మా ప్రభుత్వంలో చేసిన నియామకాలకు ఇప్పుడు ఉద్యోగ నియామక పత్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది. ఇలా ఇవ్వని ఉద్యోగాలను తామే ఇచ్చామని చెప్పుకోవడం ప్రజలను మోసం చేయడమే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ అంశంపై రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు?
కేటీఆర్: ఈ విషయంలో మాకు పూర్తి స్పష్టత ఉన్నది. కొందరికి కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం గురించి తెలియకపోవచ్చు. ఇంకొందరికి ఆయన అమలు చేసిన పథకాలపై అవగాహన లేకపోవచ్చు. మరికొందరికి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ముందు కెళ్తున్నారనేది అవగతం కాకపోవచ్చు. మేం వీరందరికీ కేసీఆర్ నాయకత్వ పటిమ, పాలనాదక్షత గురించి వివరిస్తం. ఆయన పాలనలో చేపట్టిన రైతుబంధు, మిషన్ భగీరథ లాంటి పథకాలను వివరిస్తం. తెలంగాణ కోసం చేసిన పోరాటాలను విడమరిచి చెప్తాం. ఈ దిశగా పార్టీ విద్యార్థి, యువజన విభాగాలను పటిష్ఠం చేస్తం. తెలంగాణలోని నేటి యువత ముందు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అనే మూడు పార్టీలు కనబడుతున్నయ్. మేం ఆ రెండు జాతీయ పార్టీల కంటే ఏ విధంగా ప్రత్యేకమో, మాకు ఓటేయడం ద్వారా కలిగే ప్రయోజనాలేమిటో వివరించి వారికి భవిష్యత్‌పై భరోసా కల్పించేందుకు చర్యలు చేపడతం.