మలక్ పేట, మార్చి 31: రంజాన్ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. మలక్పేట పరిధిలోని ఆజంపురాలో మాజీ మంత్రి మహమూద్ అలీ నివాసానికి వెళ్లిన ఆయన అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేత, మహమూద్ అలీ తనయుడు ఆజం అలీ, ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడి యోగాక్షేమాలు తెలుసుకున్నారు. మరోవైపు కేటీఆర్ రాకతో ఆజంపురాలో సందడి నెలకొన్నది. ఆయన రాక విషయాన్ని ముందే తెలుసుకున్న కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వీరిలో బీఆర్ఎస్ నాయకులు భూమేశ్వర్, తేళ్ల మహేష్ కుమార్, పగిళ్ల నర్సింగ్, రాము, లాయక్ అలీ, బాబు సుదర్శన్, రఘునందన్ రెడ్డి, కామేశ్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సల్మాన్, లలిత తదితరులు ఉన్నారు.