హైదరాబాద్: ఇండియన్ ఆర్మీపై రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన నీచమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. భారత ఆర్మీకి (Indian Army) క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ఎన్నికల్లో లబ్ధికోసం ఆర్మీని రేవంత్ రెడ్డి వాడుకోవడంపై మండిపడ్డారు. సైన్యంలో చేరి, తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి అపారమైన కృషి, అంకితభావం, నిబద్ధత, దేశంపై ప్రేమ అవసరమని చెప్పారు. యూనిఫామ్ ధరించిన మన సైనికులు అత్యంత కఠినమైన పరిస్థితులలో సరిహద్దులో కష్టపడుతున్నారు కాబట్టే మనం సురక్షితంగా ఉంటూ, రాజకీయాలు చేసుకోగలుగుతున్నామని హితవు పలిచారు. ఆర్మీ సరిహద్దుల్లో ఉండటం వల్లనే మనమంతా సాధారణ జీవితాన్ని గడుపుతూ కుటుంబాలతో జీవించగలుగుతున్నామని చెప్పారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం భారత సైన్యాన్ని అవమానించడం రేవంత్ రెడ్డికి సరికాదన్నారు.
ఇప్పటికే తన కామెంట్స్‌తో నీచమైన స్థాయికి చేరిన రేవంత్.. ఎన్నికల లబ్ధికోసం ఆర్మీపై కామెంట్స్ చేసి మరింతగా తన స్థాయి దిగజార్చుకున్నారని విమర్శించారు. మీరు భారత సైన్యాన్ని కించపరిచి, పాకిస్తాన్‌ను ఏ ఉద్దేశంతో పొగుడుతున్నారని ప్రశ్నించారు. మీరు భారత సైన్యానికి క్షమాపణ చెప్పి, మీ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డబ్బు సంచులతో దొరికిన రేవంత్ రెడ్డికి గుండాలు, రౌడీషీటర్లు అంటేనే గౌరవం.. అలాంటి రేవంత్‌కు శత్రుదేశాన్ని గౌరవించడం ఆశ్చర్యమేమీ లేదని చెప్పారు. ఇప్పటికైనా సైన్యాన్ని అవమానించడం రేవంత్ రెడ్డి ఆపాలని, తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకైన మర్యాదగా ప్రవర్తించాలని హితవు పలికారు.
It takes immense hardwork, dedication, commitment and love for one’s country to join the armed forces and put lives on the line. We are safe and are able to do politics, have normal lives and live with families because the men in the uniform toil at the border in the most cruel…
— KTR (@KTRBRS) November 2, 2025