సుంకిశాల ప్రాజెక్టులో ఇంజినీరింగ్ లోపం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానంలోనే లోపం ఉన్నది. సుంకిశాల ప్రమాదానికి కారణమై రాష్ట్ర ప్రజల సొమ్మును ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. ఇది మూర్ఖ, కుత్సిత మనస్తత్వం ఉన్న ప్రభుత్వం. -కేటీఆర్
KTR | హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): సుంకిశాల ప్రమాదానికి మున్సిపల్ శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైఫల్యమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర ఆరోపణ చేశారు. ఈ ప్రమాదంపై జ్యుడీషియల్ విచారణ చేయించాలని, నిర్మాణ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. సుంకిశాల ప్రమాదంపై ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి సమాచారం లేదా? సమాచారం ఉండి ఉంటే అసెంబ్లీలో ఎందుకు ప్రకటన చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ది మూర్ఖపు ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి అసమర్థత, చేతగానితనం చేవలేనితనం వల్లనే సుంకిశాల ప్రమాదం జరిగిందని మండిపడ్డారు.
ప్రభుత్వం తప్పు లేకుంటే ఎందుకు వారంపాటు ప్రమాదాన్ని రహస్యంగా ఉంచారని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాగానే అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారని, సుంకిశాలపై ఎందుకు ప్రకటన చేయలేదని నిలదీశారు. ప్రభుత్వానికి ప్రమాదం విషయం తెలియదా? తెలిసినా ప ట్టించుకోలేదా? అని నిలదీశారు. ప్రభుత్వానికి విషయం తెలియలేదంటే సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ప్రమాదం గురించి సీఎంకు, ప్రభుత్వానికి సమాచారం తెలుసునని, వారంపాటు గోప్యంగా ఉంచారని మండిపడ్డారు. అధికారులు చెప్పినా వినకుండా గేట్లు అమర్చడంతో ప్రమాదం జరిగిందని ఆరోపించారు. అదృష్టవశాత్తు కూలీలు షిఫ్ట్ మారినప్పుడు ప్రమా దం జరిగిందని, లేకుంటే చాలా ప్రాణనష్టం జరిగేదని ఆవేదన వ్యక్తంచేశారు. మంచి జరిగితే తమ ఘనత, చెడు జరిగితే బీఆర్ఎస్ తప్పు అంటూ తప్పుడు ప్రచారం చేసే చిల్లర ప్రయత్నాలు వద్దని హితవు చెప్పారు.
కేసీఆర్ విజయాలను అంగీకరించలేక..
ఎన్నికల్లో ప్రయోజనం కోసం కాళేశ్వరంపై చేసిన అడ్డగోలు వాదన వీగిపోయిందని, 12 లక్షల క్యూసెకుల వరద వచ్చినా ప్రాజెక్టు చెకుచెదరకుండా ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నా రు. కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగానే పూర్తిగా విఫలమైతే, ఇప్పుడు ఏవిధంగా రిజర్వాయర్లను నింపుతున్నదని ప్రశ్నించారు. ‘వీళ్లకు సరుకు లేదు. సబ్జెక్ట్ లేదు. బరాజ్ గేట్లు ఎప్పుడు దించుతారో కూడా తెలియదు’ అని మండిపడ్డారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి ఇబ్బంది లేదని, ఇంత మంచి ప్రాజెక్ట్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇం జనీర్లే ఆవేదన వ్యక్తంచేస్తున్నారని చెప్పారు.
జ్యుడీషియల్ విచారణ జరిపించాలి
సుంకిశాల ప్రమాదంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాలని, ఘటన స్థలంలోనే భట్టి విక్రమార్క పకటన చేయాలని కేటీఆర్ డి మాండ్ చేశారు. మేడిగడ్డ అంశంపై తాము జాప్యం చేయలేదని, ఎన్నికల కోడ్ ఉన్నా సరే ప్రమాదం జరిగిన విషయాన్ని చెప్పామని గు ర్తుచేశారు. ఘటన జరిగిన గంటల్లోనే లోపాలు సరిదిద్దుతామని ఎల్అండ్టీ చెప్పిందని, రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని కేటీఆర్ స్పష్టంచేశారు. కానీ, సీఎం సుంకిశాల విషయాన్ని ఎందుకు దాచారని ప్రశ్నించారు. ప్ర మాదం జరిగినప్పుడు సీఎం హైదరాబాద్‌లో నే ఉన్నారని, ఆ మరునాడే దాని మీద పర్యవేక్షణ, సమీక్ష లేకుండా అమెరికా వెళ్లారని ఆరోపించారు. భట్టి విక్రమార ఇతరులపై త ప్పుడు ప్రచారాలు చేయొద్దని, ఒకవేళ సీఎం కు విషయం తెలియకపోతే ఆయనకు పరిపాలనపై పట్టు లేనట్టేనని కేటీఆర్ స్పష్టంచేశారు.
సుంకిశాల చరిత్ర ఇది.
మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాసర్‌రెడ్డి హయాంలో సుంకిశాల ప్రతిపాదన చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. అప్పట్లో తమకు అన్యాయం చేయొద్దంటూ రైతులు అడ్డుకోవడంతో ఎస్ఐ కూడా చనిపోయారని, గత ప్రభుత్వాల హయాంలో రెండు, మూడు దశ లు అంటూ ప్రతిపాదనలు తెచ్చారని వివరించారు. రైతులు మళ్లీ అడ్డుకోవడంతో ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పారు. ఆ తరువాత రైతు ల్లో విశ్వాసం నింపడంతో సుంకిశాలను అడ్డుకోలేదని తెలిపారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు ఎత్తిపోయాలంటే నాగార్జునసాగర్‌లో 510 అడుగుల నీటిమట్టం ఉంటే నే సాధ్యమవుతుందని, సుంకిశాలలో 462 అడుగులున్నా సరే నీళ్లు తీసుకోవచ్చని, రాబో యే 50 ఏండ్లలో హైదరాబాద్ నీటి అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్‌ను కేసీఆర్ చేపట్టారని వివరించారు. నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజా ప్రతినిధులందరితో కలిసి దీనికి శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. మూడు పైప్లైన్ల ద్వారా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్నదని, కృష్ణానదికి మూడు, నాలుగేండ్లు వర ద రాకపోయినా డెడ్‌స్టోరేజీ నుంచి సుంకిశాల ద్వారా నీళ్లు తేవచ్చని చెప్పారు. ఓఆర్ఆర్ చు ట్టూ ఒక రింగ్ మెయిన్ చేయాలనే ఉద్దేశంతో గోదావరి, కృష్ణా నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేశామని కేటీఆర్ వివరించారు.
మహానగరాల్లో కొరత కానీ,
ఢిల్లీ, బెంగళూరు లాంటి మహానగరాల్లో భారీగా నీటి కొరత ఉన్నదని, నీళ్ల కోసం యుద్ధాలు జరిగే పరిస్థతి హైదరాబాద్‌లో లేదని కేటీఆర్ గుర్తుచేశారు. హైదరాబాద్‌కు తాగునీటి కొరత లేకుండా చేసేందుకే సుంకిశాల ప్రాజెక్ట్ చేపట్టామని వివరించారు.. సుంకిశాల పనులు చాలా వేగంగా పూర్తి చేశామని, ఒక మోటర్ ఫిట్టింగ్ పనులు మాత్రమే మిగిలిపోయాయని, 2024 వేసవికాలం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం పనులను పెండింగ్‌లో పెట్టిందని మండిపడ్డారు. మొన్నటి ఎండకాలంలో హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్లు తెప్పించుకోవాల్సిన దుస్థితి రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వచ్చాయని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద కూడా విమర్శలు రావడంతో రెండు, మూడు నెలల కిత్రం దున్నపోతు నిద్రవీడారని ఎద్దేవా చేశారు. ఆ తర్వాత అధికారులపై ఒత్తిడి పెట్టి ఆగమాగంగా పనులు చేపట్టారని, ఈ ప్రమాదం ఎందుకు జరిగిందనే అంశంపై జలమండలి అధికారితో వివరంగా మాట్లాడానని కేటీఆర్ తెలిపారు. ‘సీతారామ ప్రాజెక్ట్ గురిం చి భట్టివిక్రమార్క బిల్డప్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్‌ను చేపట్టింది, పూర్తి చేసింది కూడా కేసీఆరే. కేసీఆర్ పూర్తి చేసిన పథకాన్ని కాంగ్రెస్ పూర్తి చేసినట్టు చెప్పుకున్నా ప్రజలకు అన్ని విషయాలు తెలుసు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే వివేకానంద పాల్గొన్నారు.
పరిపాలన చేతకాక…
ఎస్సెల్బీసీ టన్నెల్ పనులను కూడా వేగంగా చేశామని, సాగునీటితోపాటు తాగునీటికి కూడా ప్రాధాన్యం ఇవ్వడంతోనే రైతులు ఆందోళన చేయలేదని కేటీఆర్ వివరించారు. పేర్లు మార్చడామేనా మార్పు అంటే? అని ప్రశ్నించారు. భట్టి విక్రమార్క తన ఆలోచనా విధానం మార్చుకోవాలని సూచించారు. తాము కూడా సుంకిశాలకు వెళ్లి అన్ని విషయాలు అకడ నుంచి వివరిస్తామని ప్రకటించారు. నీళ్ల విషయంలో కేసీఆర్‌కు పేరు వస్తదనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పరిపాలన రాక ప్రతి దానికి కేసీఆర్ మీద తప్పుడు ప్రచారం చేసున్నారు. హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, వారి బాకా ఊదే పత్రికలే శాంతిభద్రతల మీద కథనాలు రాస్తున్నాయని చెప్పారు.
నీళ్ల విషయంలో కేసీఆర్ విజయాలను అంగీకరించలేని కురచ మనస్థత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. మేడిగడ్డ మీద విచారణ చేస్తున్నారు. పది లక్షల క్యూసెకుల ప్రవాహం ఉన్నా సరే మేడిగడ్డకు ఏమీ కాలేదు. ఇన్నాళ్లు కాళేశ్వరంపై చిల్లర, దివాలాకోరు ప్రచారాలు చేశారు. ప్రకృతే తప్పుడు ప్రచారాలకు సమాధానం చెప్పింది.
-కేటీఆర్
కాళేశ్వరంలో ప్రమాదం జరిగితే ఎన్డీఎస్ఏ వస్తది, ఆగమేఘాల మీద రిపోర్ట్ ఇస్తది, మరి సుంకిశాలకు ఎందుకు కేంద్ర సంస్థ వస్తలేదు. ఇది కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయారనడానికి నిదర్శనం.
-కేటీఆర్
సుంకిశాల ప్రాజెక్టులో ఇంజనీరింగ్ లోపం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానంలోనే లోపం ఉన్నది. సుంకిశాల ప్రమాదానికి కారణమై రాష్ట్ర ప్రజల సొమ్మును ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. ఇది మూర్ఖ, కుత్సిత మనస్థత్వం ఉన్న ప్రభుత్వం.
-కేటీఆర్