హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా వివక్షతో వ్యవహరిస్తున్నది. నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రకటించిన బల్క్‌డ్రగ్ పార్కుల ఏర్పాటు పథకంలో తెలంగాణకు చోటు కల్పించకపోవడమే ఇందుకు నిదర్శనం. దీనిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్‌ను కేంద్రం ఉద్దేశపూర్వకంగానే విస్మరించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో దేశ రాజధానిగా, వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్‌గా ఖ్యాతి పొందిన హైదరాబాద్‌ను పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు.
బల్‌డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలను ఎంపికచేసి, తెలంగాణను పక్కన పెట్టడం మోదీ సరార్ వివక్షాపూరిత రాజకీయాలకు పరాకాష్ఠ అని నిప్పులు చెరిగారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతున్న హైదరాబాద్ ఫార్మా సిటీ పేరును కనీసం పరిశీలించకుండా తెలంగాణ పట్ల తనకున్న వివక్షను కేంద్రం మరోసారి చాటుకొన్నదని విమర్శించారు. బల్‌డ్రగ్ పారు కేటాయింపులో తెలంగాణకు జరిగిన తీవ్ర అన్యాయాన్ని ఎండగడుతూ కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు శుక్రవారం ఘాటైన లేఖ రాశారు. ఆ లేఖలోని అంశాలు ఇవీ..
2 వేల ఎకరాలు సిద్ధం
దేశీయ ఫార్మా రంగానికి అవసరమైన ముడిసరుకుల కోసం 70 శాతానికిపైగా చైనాపైనే ఆధారపడాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో బల్క్‌డ్రగ్ పార్కుల ఏర్పాటును 2015లోనే తెరపైకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఈ పథకం అమలులో తీవ్ర జాప్యం చేసిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. చివరికి కొవిడ్ సంక్షోభంతో కండ్లు తెరిచి 2020లో ఈ పథకంపై అధికారిక ప్రకటన చేసిన కేంద్రం.. ఆ తర్వాత ఎట్టకేలకు తెలంగాణ సహా ఇతర రాష్ర్టాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించినప్పటికీ వాటిపై నిర్ణయం తీసుకొనేందుకు మరో రెండేండ్లు ఆలస్యం చేసిందని పేర్కొన్నారు.
తెలంగాణకు బల్క్‌డ్రగ్ పార్కు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసిందని, హైదరాబాద్ ఫార్మా సిటీలోని 2 వేల ఎకరాల్లో ఈ పారును ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేయడంతోపాటు ఫార్మా సిటీ మాస్టర్ ప్లాన్‌ను కూడా అందజేసిందని వివరించారు. కీలకమైన భూసేకరణ, పర్యావరణ అనుమతులతోపాటు ఫార్మాసిటీకి ఉన్న సానుకూలతలను వివరిస్తూ కేంద్రానికి సమగ్రమైన నివేదిక ఇచ్చామని, అంతేకాకుండా కేంద్ర మంత్రులను కలిసిన ప్రతిసారీ బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటుకు విజ్ఞప్తి చేశామని మంత్రి కేటీఆర్ తన లేఖలో గుర్తుచేశారు.
ఫార్మా పురోగతిని దెబ్బతీయడమే..
ప్రపంచ స్థాయి ప్రమాణాలు, దీర్ఘకాలిక విజన్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్, కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌ంట్, పూర్తిస్థాయి హీటింగ్, కూలింగ్ వ్యవస్థలు, కామన్ డ్రగ్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ తదితర విభాగాల సమాహారంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్ ఫార్మాసిటీని జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా కేంద్రం ఇది వరకే గుర్తించిందని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. అయినా బల్‌డ్రగ్ పారు ఏర్పాటులో కేంద్రం హైదరాబాద్‌ను విస్మరించడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. ఫార్మా రంగంలో దేశం స్వయం సమృద్ధిని సాధించాలన్న లక్ష్యానికి మోదీ సర్కారు నిజంగానే కట్టుబడి ఉంటే తెలంగాణలో వెంటనే బల్‌డ్రగ్ పారును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రజయోజనాల కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో అద్భుతంగా రూపుదిద్దుకొంటున్న హైదరాబాద్ ఫార్మసిటీలో బల్‌డ్రగ్ పార్కును ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు చేదోడుగా నిలవాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు.
మోదీది టైంపాస్ ప్రభుత్వం
బల్‌డ్రగ్ పార్కుల ఏర్పాటుకు 2015 లో నిర్ణయం తీసుకొన్న మోదీ సరార్.. ప్రతిపాదనల పరిశీలన, ఇతర అంశాల పేరుతో 2021 వరకు టైంపాస్ చేసిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బల్‌డ్రగ్ పార్కు ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ, ప్లానింగ్, డిజైన్, పర్యావరణ, ఇతర అనుమతులు తీసుకోవడానికే కనీసం మూడేండ్ల సమయం పడుతుందన్నారు. చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా దేశీయ ఫార్మా రంగం సాధ్యమైనంత త్వరగా స్వయం సమృద్ధిని సాధించాల్సిన ఆవశ్యకత ఉన్నదని పేర్కొన్నారు.
ఈ విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే అన్ని వసతులు సిద్ధంగా ఉన్న తెలంగాణను పక్కనపెట్టి ఇతర రాష్ర్టాలకు బల్క్‌డ్రగ్ పార్కులను కేటాయించేది కాదన్నారు. తెలంగాణకు బల్‌డ్రగ్ పార్కును కేటాయిస్తే వెంటనే పని ప్రారంభించవచ్చన్న కనీస సోయి మోదీ సర్కారుకు లేకపోవడం దేశ ప్రజల దురదృష్టమన్నారు. దీని వల్ల దేశ ప్రయోజనాలకు విఘాతం కలగడంతోపాటు బల్‌డ్రగ్ తయారీ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యానికి గండి పడుతుందని పేర్కొన్నారు. మోదీ సరారు నిర్ణయంతో తెలంగాణతోపాటు యావత్ దేశం భారీగా నష్టపోతుందని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.