నాంపల్లి కోర్టులు, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పురువు నష్టం కేసు విచారణ జనవరి 6కు వాయిదా పడింది. శుక్రవారం ఈ కేసు విచారణ సందర్భంగా ప్రతివాదుల తరఫు న్యాయవాదులు సిటీ సివిల్ కోర్టుకు వకాలత్ను సమర్పించారు.
‘డెక్కన్ హెరాల్డ్’ పత్రిక తరఫున ఎవరూ హాజరు కాకపోవడంతో తదుపరి వాయిదా నాటికి కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఎక్స్పార్టీ ఆదేశాలు జారీచేసింది.