హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయమైన తెలంగాణభవన్‌లో బుధవారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేక్ కట్‌చేశారు. నూతన క్యాలెండర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలు కేటీఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. అసమర్థ కాంగ్రెస్ సర్కారు పాలనపై అలుపెరుగని పోరాటం చేద్దామని, అందుకు పార్టీ నేతలు, శ్రేణులు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ఏకైక లక్ష్యంతో పార్టీ శ్రేణులంతా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి, ఎంపీలు కేఆర్ సురేశ్‌రెడ్డి, దీవకొండ దామోదర్‌రావు, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ముఠా గోపాల్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, పార్టీ నాయకులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా, నలమోతు భాస్కర్‌రావు, బాల్క సుమన్, చెరుకు సుధాకర్, రాకేశ్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, దేవీప్రసాద్, తుల ఉమ, గడ్డం శ్రీనివాస్‌యాదవ్, రావుల శ్రీధర్‌రెడ్డి, దూదిమెట్ల బాలరాజుయాదవ్, రంగినేని అభిలాశ్, చిరుమళ్ల రాకేశ్, వై సతీశ్‌రెడ్డి, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, కిశోర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.