ఆరు గ్యారెంటీలన్నీ గారడీలేనని, 420 హామీలన్నీ నయవంచనేనని తేలిపోయింది. రేవంత్ సరార్కు నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయం. మెగా డీఎస్సీ పేరిట దగా, నిరుద్యోగ భృతి పేరిట చేసిన ద్రోహానికి గుణపాఠం చెప్పేందుకు ఆదిలాబాద్ నుంచి అశోక్‌నగర్ చౌరస్తా వరకూ ప్రతి నిరుద్యోగీ సిద్ధంగా ఉన్నడు. చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ యువత సంఘటిత శక్తిలో ఉన్న బలం ఏమిటో, వారు బిగించే పిడికిళ్లు కాంగ్రెస్ పునాదులను ఎలా పెకిలిస్తాయో త్వరలోనే చూస్తం.
-కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : అధికారం చేపట్టిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి రెండేండ్లయినా రేవంత్‌రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముకునేలకు రాసినా నిరుద్యోగులు క్షమించబోరని హెచ్చరించారు. ఉద్యోగాల భర్తీపై సీఎం ముఖం చాటేయడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అడ్డదారిలో గద్దెనెకిన రేవంత్‌రెడ్డి.. తీరా అది ఐదేండ్ల హామీ అని పీసీసీ చీఫ్‌తో సీఎం పలికించడంపై యువతరం ఛీకొడుతున్నదని మండిపడ్డారు. తొలి సంవత్సరమే రెండు లక్షల నియామకాలు చేపట్టకపోతే ప్రభుత్వాన్ని దించేయాలని ఢిల్లీ నుంచి వచ్చి మరీ చెప్పిన ప్రియాంకగాంధీ మాట అమలై ఉంటే.. ఈ దగాకోరు సరార్ కుప్పకూలి ఇప్పటికే ఏడాది పూర్తయ్యేదని నిప్పులు చెరిగారు. కేసీఆర్ హయాంలో చివరి దశలో ఉన్న 65 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి ఫొటోలకు పోజలు కొట్టిన సీఎం, ఆ తర్వాత మొత్తానికే చేతులెత్తేయడంతో తెలంగాణలో రిక్రూట్మెంట్ జీరోగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు మంగళవారం కేటీఆర్ ప్రకటన విడుదల చేశారు. అప్పటికే లక్షా 65 వేల ఉద్యోగాలను భర్తీ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై పనిగట్టుకొని రేవంత్ చల్లిన బురద అంతా అబద్ధాలతో అందలం ఎకడానికేనని అందరికీ అర్థమైపోయిందని తెలిపారు. పట్టుమని పదివేల కొత్త ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వని చేతకాని దద్దమ్మ పాలన చూసి నిరుద్యోగులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా దుమ్మెత్తి పోస్తున్నారని దుయ్యబట్టారు.
జాబ్ క్యాలెండర్‌కు పాతరేసిన రేవంత్‌రెడ్డి సర్కార్.. వరుస కుంభకోణాలతో జేబులు నింపుకొంటున్న తీరును తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉన్నదని కేటీఆర్ హెచ్చరించారు. రెండు లక్షల ఉద్యోగాల హామీపై నాలుక మడతేసినంత మాత్రాన నాలుగు కోట్ల ప్రజలు ఊరుకుంటారని, సీఎం చేసిన మోసాన్ని మరచిపోతారని అనుకుంటే అది పొరపాటే అని చెప్పారు. నిరుద్యోగులను నమ్మించి నయవంచన చేసినందుకు ముఖ్యమంత్రి ముకు నేలకు రాసి క్షమాపణలు చెప్పినా, పొర్లుదండాలు పెట్టినా క్షమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. నిరుద్యోగులు, విద్యార్థులకు చేస్తున్న ఈ ద్రోహంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతామని హెచ్చరించారు. ‘మేధావుల ముసుగు వేసుకుని మాయమాటలతో మభ్యపెట్టిన గొంతులన్నీ రెండేండ్ల్ల నుంచి మూగబోయినంత మాత్రాన మీరు చేసిన పాపం ఊరికే పోదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిరుద్యోగులనే కాకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. మూడు దఫాలుగా రైతుబంధు ఎగ్గొట్టి 70 లక్షల మంది అన్నదాతల పొట్టకొట్టారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఆత్మగౌరవంతో బతికిన రైతన్నను అప్పులపాలు చేసి తీరని ద్రోహం చేశారని వాపోయారు. సీఎం సీటుపై కూర్చున్న మరుక్షణంలోనే ప్రతి మహిళకూ రూ. 2,500 ఇస్తానన్న మాటకు రెండేండ్లయినా దికులేకపోవడంతో ఆడబిడ్డలు కోపంతో రగిలిపోతున్నారని చెప్పారు. ఆరు గ్యారెంటీలన్నీ అక్షరాలా గారడీలేనని, 420 హామీలన్నీ నయవంచన మాత్రమేనని తేలిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ సరార్కు నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయమని, మెగా డీఎస్సీ పేరిట దగా, నిరుద్యోగ భృతి పేరిట చేసిన ద్రోహానికి గుణపాఠం చెప్పేందుకు ఆదిలాబాద్ నుంచి అశోక్‌నగర్ చౌరస్తా వరకూ ప్రతి నిరుద్యోగీ సిద్ధంగా ఉన్నాడని హెచ్చరించారు. చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ యువత సంఘటిత శక్తిలో ఉన్న బలం ఏమిటో, వారు బిగించే పిడికిళ్లు కాంగ్రెస్ పునాదులను ఎలా పెకిలిస్తాయో త్వరలోనే చూస్తామని స్పష్టంచేశారు.