హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురై చికిత్స హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు, మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి సోమవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకొన్నారు. పూర్తిగా కోలుకొని యథావిధిగా ప్రజాజీవనంలో కొనసాగాలని ఆకాంక్షించారు. పరామర్శించిన వారిలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్‌జాదవ్, కల్వకుంట్ల సంజయ్ తదితరులు ఉన్నారు.