హైదరాబాద్ : మాజీ మంత్రి జీవన్ రెడ్డితో చర్చలకై జగిత్యాల పర్యటనకు వెళ్తున్న కేటీఆర్ మార్గ మధ్యంలో కరీంనగర్లో ఉన్న కాసర్ల నాగేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నాగేందర్ రెడ్డి ఆస్ట్రేలియాలో పార్టీ బలోపేతం కోసం చేస్తున్న కృషిని కొనియాడారు.
పార్టీ కోసం కష్టపడేవారిని ఎల్లవేళల ప్రోత్సహిస్తామని, యువతకు ఇక పై అగ్ర పీఠం వేస్తామని కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ తో పాటు ఎంపీ దామోదర్ రావు, వినోద్ కుమార్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, కౌశిక్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ చైర్మన్ లు నాగేందర్ రెడ్డి ఇంటికి వెళ్లినవారిలో ఉన్నారు.