హైదరాబాద్: వ్యవసాయ పంటల వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలవడంపై మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 2011-2020 మధ్య వ్యవసాయ రంగంలో వివిధ రాష్ర్టాలు సాధించిన వృద్ధిపై నీతిఆయోగ్ విశ్లేషణ నివేదిక విడుదల చేసింది.
ఈ నివేదికలో త్రిపుర 6.87 శాతంతో తొలిస్థానం సాధించగా, తెలంగాణ 6.59 శాతంతో రెండోస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. “మీకు, తెలంగాణ రైతులకు కృతజ్ఞతలు” అంటూ ట్వీట్ చేశారు.