KTR | తెలంగాణ సచివాలయ మాజీ సీఎస్ఓ, 17వ పోలీసు బెటాలియన్ కమాండెంట్ గంగారాం (58) (Gangaram) మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంతాపం వ్యక్తం చేశారు. పోలీసు శాఖకు ఉన్నతంగా సేవలందిస్తున్న గంగారాం మరణించడం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ గంగారాం (Gangaram) సోమవారం రాత్రి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి తన బ్యాచ్ మెంట్ అయిన సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. స్నేహితుడిని కలిసి తిరిగి ఇంటికి బయల్దేరారు. ఈ క్రమంలో లిఫ్ట్ ఎక్కేందుకు బటన్ నొక్కగా.. డోర్ తెరచుకుంది. లిఫ్టు రాకపోయినా గేటు తెరచుకోవడంతో అది గమనించని గంగారాం మూడో అంతస్తు నుంచి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న లిఫ్ట్‌పై పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించేలోపే గంగారాం మృతిచెందారు.
Also Read..
KTR | పదో తరగతి విద్యార్థులకు కేటీఆర్ చిరుకానుక.. పరీక్షలు రాయడానికి ప్యాడ్, పెన్నుల పంపిణీ