KTR | హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్రలు పన్నుతున్నాయని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరాన్ని వేరే దేశంలో కడితే కేసీఆర్‌తోపాటు ఆ ప్రాజెక్టు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేవని చెప్పా రు. కానీ, మనదేశంలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కుసంసారం, కుట్రపూరిత రాజకీయాల్లో ప్రాజెక్టు పావుగా మారడమే విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు.
కాళేశ్వ రం అంటే అనేక బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, వేల కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ అని, ఇందులోని ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో 85 పిల్లర్లలో రెండు పిల్లర్లు డ్యామేజ్ అయితే ఇంత హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. కక్ష సాధింపు, రాజకీయ వేధింపులు తప్ప ఇందులో ఏమీ లేదని, కమిషన్ విచారణలో నిజానిజాలు బయటకు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ తెలంగాణ చరిత్ర అని, ఆయనను పిలిచి ఇరిగేషన్ గురించి మాట్లాడమంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయడమేనని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి లాం టి వ్యక్తికి వంద జన్మలెత్తినా కేసీఆర్ గొప్పతనం అర్థం కాదని విమర్శించారు.
రేవంత్‌రెడ్డికి ప్రభుత్వాన్ని నడప డం చేతకావడం లేదని విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు బుధవారం కేసీఆర్ హాజరైన నేపథ్యం లో బీఆరేభవన్ ఎదుట కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం అంటే 3 బరాజ్‌లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టులు, 240 టీఎంసీల నీటి వినియోగమని వివరించారు. ఇందులో ఒకటి మేడిగడ్డ బ్యారేజీ అని, అందులోని 85 పిల్లర్లలో రెండు పిల్లర్లకు డ్యామేజీ జరిగిందని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగడం వెనుక కూడా కాంగ్రెస్ కుట్ర ఉన్నట్టుగా తమకు అనుమానం ఉన్నదని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డి కూలగొట్టడానికే వచ్చాడు. కట్టడానికి రాలేదు. వంద జన్మలెత్తినా రేవంత్‌రెడ్డికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు. రేవంత్‌రెడ్డి గురువునే ఇకడి నుంచి కరకట్టకు తరిమేసినోడు కేసీఆర్. రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడినా, ఆయన ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్‌ను ఏం చేయలేరు.
-కేటీఆర్
తెలంగాణలోని వాగులు, వంకలు, నదులు, చెరువుల మీద కేసీఆర్‌కు ఉన్నంత సంపూర్ణ అవగాహన సమకాలీన రాజకీయాల్లో దేశంలో ఇంకో రాజకీయ నేతకు లేదని కేటీఆర్ స్పష్టంచేశారు. ‘ధర్మం, న్యాయమే గెలుస్తుంది. నిజాలు బయటికి వస్తాయి. అల్టిమేట్‌గా తెలంగాణ సాధించిన నాయకుడిగా, తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా కేసీఆర్ పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. రేవంత్‌రెడ్డి రాజకీయాలను ప్రజలు పట్టించుకోవాల్సిన పనిలేదు.
కాళేశ్వరం కాదు, ఇంకా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా 420 హామీలు, ఆరు గ్యారెంటీల అమలు నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని ఎంత ప్రయత్నించినా మరలనియ్యబోం. ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం. ఎన్ని రకాలుగా వేధించినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోం. కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేదాకా వెంటాడుతూనే ఉంటా. కచ్చితంగా రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో బట్టలిప్పి నిల్చోబెట్టే విధంగా మా కార్యచరణ ఉంటుంది. దానికి రాష్ట్ర ప్రజలంతా మద్దతు పలకాలి’ అని కోరారు.
ఢిల్లీకి వెళ్లి పోర్ట్ ఫోలియోలు నిర్ణయించుకునే దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి క్యాబినెట్ అంటే అర్థం కాదని, అది ఎలా పనిచేస్తుందో తెలియదని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు, రాక్షసానందం, పైశాచిక ఆనందమే రేవంత్‌రెడ్డికి ముఖ్యమని, ఆయన ఆలోచనలు విధ్వంసకరమైనవని విమర్శించారు. రేవంత్‌రెడ్డి గతంలో బ్యాగులు మోసి జైల్లో పడ్డారు కాబట్టే, బీఆర్ఎస్ నాయకులను కూడా జైల్లో పెట్టాలనే వికృత ఆలోచనతో ఉన్నారని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను కేటీఆర్ ఖండించారు. 94 వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని తెలివితకువ వాళ్లే అంటారని, రేవంత్‌రెడ్డికి పిల్లనిచ్చిన మామ సూదిని పద్మారెడ్డి స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మామ దగ్గర రేవంత్‌రెడ్డి ఓ ఐదు నిమిషాలు కూర్చొని కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలుసుకోవాలని సూచించారు.
కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసింగ్ వంటి విషయాలను ముందుపెట్టి 420 హామీలు, ఆరు గ్యారెంటీల అమలు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రజల దృష్టిని మరల్చలేరని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ముందు అన్ని చర్చలు జరుగుతాయని, ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటికి సమర్థవంతమైన సమాధానాలు తమ నాయకులు ఇస్తారని కేటీఆర్ స్పష్టంచేశారు. ఇప్పటికే హరీశ్‌రావు ఇచ్చిన ప్రజెంటేషన్‌తో కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఫీజులు ఎగిరిపోయాయని, ప్రజలకు కూడా వాస్తవాలు అర్థమైపోయాయని చెప్పారు. కొత్తగా చెప్పడానికి లేదా అడగడానికి ఏమీ లేదని, సాంకేతికంగా పిలవాల్సి వచ్చినందునే కేసీఆర్‌ను పిలిచారని తాను భావిస్తున్నానని చెప్పారు.
కాళేశ్వరం కాదు, ఇంకా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా 420 హామీలు, ఆరు గ్యారెంటీల అమలు నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని ఎంత ప్రయత్నించినా మరలనియ్యబోం. ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం. ఎన్ని రకాలుగా వేధించినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోం. ఆ పార్టీని బొంద పెట్టేదాకా వెంటాడుతూనే ఉంటా.
-కేటీఆర్
రేవంత్‌రెడ్డి కూలగొట్టడానికే వచ్చాడని, కట్టడానికి రాలేదని కేటీఆర్ విమర్శించారు. పేద ప్రజల ఇండ్లను కూలగొట్టడం తప్ప, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు నిర్మించడం ఆయనకు చేతకాదని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఆలోచనలు విధ్వంసకరమైనవని, రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులతో నడుస్తున్నాయని విమర్శించారు. వంద జన్మలెత్తినా రేవంత్‌రెడ్డికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదని చెప్పారు. ‘రేవంత్‌రెడ్డి గురువునే ఇకడి నుంచి కరకట్టకు తరిమేసినోడు కేసీఆర్. రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడినా, ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్‌నే ఏమీ చేయలేరు’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.
నిజం నిలకడ మీద తెలుస్తుందని, నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న ఈ డ్రామాలు తాతాలికమేనని కేటీఆర్ చెప్పారు. తెలంగాణను సాధించి సస్యశ్యామల నేలగా మార్చిన కేసీఆర్‌ను వేధిస్తే ప్రజాక్షేత్రంలో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ధర్మం, న్యాయమే గెలుస్తుందని, నిజాలు బయటికి వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి రాజకీయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై దృష్టి పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల తరపున ఈ చేతగాని రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ ప్రశ్నిస్తూనే ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టే వరకు వెంటాడుతుందని కేటీఆర్ హెచ్చరించారు.
కేసీఆర్ జీవితం ఒక చరిత్రగా నిలిచిపోతుందని కేటీఆర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు 60 ఏండ్ల్లలో చేయలేని అనేక కార్యక్రమాలను కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్లలోనే విజయవంతంగా సాధించారని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య పోరాటంతో, తెలంగాణ ఆర్తితో తెలంగాణ కోసం, కేవలం తెలంగాణ కోసమే కేసీఆర్ పనిచేశాని వివరించారు. ‘ఉద్యమం ద్వారా కోట్లాది మందికి స్వరాష్ట్ర ఆశయాన్ని అందించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం కరువుకు, దాహానికి శాశ్వత పరిషారం చూపించారు. కేసీఆర్ బలం, జీవన దృకోణాన్ని అర్థం చేసుకోవడానికి జోకర్ కాంగ్రెస్ నాయకులకు జీవితకాలం కూడా చాలదు. అల్ప మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ నాయకులు 100 జన్మలు ఎత్తినా కేసీఆర్ సాధించిన విజయాల్లో పదోవంతైనా సాధించలేరు’ అని ఎక్స్‌లో కేటీఆర్ విమర్శించారు.
తెలంగాణలోని వాగులు, వంకలు, నదులు, చెరువుల మీద కేసీఆర్‌కు ఉన్నంత సంపూర్ణ అవగాహన సమకాలిన రాజకీయాల్లో దేశంలో ఇంకో రాజకీయ నేతకు లేదు. ధర్మం, న్యాయమే గెలుస్తుంది. నిజాలు బయటికి వస్తాయి. అల్టిమేట్‌గా తెలంగాణ సాధించిన నాయకుడిగా, తెలంగాణను సస్యశ్యామలం చేసిన నేతగా కేసీఆర్ పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.
-కేటీఆర్
కేసీఆర్‌ను కాళేశ్వరం కమిషన్ ముందు నిలబెడితే సీఎం రేవంత్‌రెడ్డికి పైశాచిక ఆనందం వస్తుందేమో కానీ, కేసీఆర్ ఖ్యాతి మాత్రం ఇసుమంతైనా తగ్గదని కేటీఆర్ అన్నారు. ‘కేసీఆర్ ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడే. మీరంతా సూర్యుడిని అరచేతితో ఆపాలనుకునే మూర్ఖులే. బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు. తెలంగాణ కన్నీళ్లు తుడిచిన కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి మీ తెలివి సరిపోదు. తెలంగాణని తెచ్చింది కేసీఆర్ నాయకత్వమే అనేది చరిత్రలో నిలిచిపోయే వాస్తవం. తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం’ అని ‘ఎక్స్’లో కేటీఆర్ పేర్కొన్నారు.