హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాటి పార్టీ కార్యక్రమాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) రద్దు చేశారు. అదేవిధంగా జూబ్లీహిల్స్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రటకించారు.
మరోవైపు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత.. హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.