హైదరాబాద్, జనవరి 20 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ ఏడాది పాలనలో కటింగ్లు, కటాఫ్లే తప్ప, రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో కోతలు, కటాఫ్లపై ఎక్స్ వేదికగా ఆయన ఎండగట్టారు.
రైతు రుణమాఫీ, రైతుభరోసా, సాగునీరు, కరెంట్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, తులం బంగారం, మహాలక్ష్మి రూ.2,500, పింఛన్ రూ.4,000, రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, జాబ్ క్యాలెండర్, రూ.2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ.25 వేల పింఛన్, ఉద్యమకారులకు 250 గజాల జాగ, రైతులకు రూ.3 లక్షల వడ్డీలేని రుణాలు, భూమిలేని రైతులకు రైతుబీమా, నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం, ఆశ కార్యకర్తలకు రూ.18 వేల వేతనం, 50 ఏండ్లు పైబడిన జానపద కళాకారులకు రూ.3 వేల పింఛన్.. ఇలా అన్నీ కట్ చేసిందని విమర్శించారు.