సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క చాన్స్ ఇవ్వాలని అంటున్నడు.రెండేండ్ల కింద ఒక్క చాన్స్ ఇస్తేనే అన్ని వర్గాలను ఆగం చేసిండు. రేవంత్‌కు ఒక చాన్స్ ఇస్తేనే 160 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నరు. ఒక చాన్స్ ఇస్తేనే కదా.. పేదల ఇండ్లు కూలగొట్టిండు. మహిళలను మోసం చేసిండు. హైదరాబాద్‌ను నాశనం చేసిం డు. రియల్ ఎస్టేట్‌ను భ్రష్టుపట్టించిండు. ఫస్ట్‌ప్లేస్‌లో ఉన్న తెలంగాణను లాస్ట్ ప్లేస్‌కు దిగజార్చిండు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఒక్క చాన్స్ అని అడుగుతున్నడు?
–కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్‌కు ఓటేయకుంటే పథకాలు రద్దు చేస్తనని రేవంత్ బెదిరిస్తున్నడు. నీ అయ్య సొమ్మా? నీ అబ్బ సొమ్మా? ఎవడబ్బ సొమ్మని పథకాలు బంద్ చేస్తవ్?’ అంటూ సీఎం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే కాంగ్రెస్ గల్లా పట్టి పథకాలను అమలు చేయిస్తామని ఓటర్లకు భరోసా ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో కారును గెలిపించి, పేదల బతుకులను కూల్చేస్తున్న బుల్డోజర్ను ఓడించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘బోరబండ రోడ్ షోకు వచ్చిన జనాన్ని చూస్తుంటే జూబ్లీహిల్స్ గెలుపు పకా అని తేలిపోయింది.. ఇక మెజార్టీ ఎంత అనేదే తేలాల్సి ఉన్నది’ అని చెప్పారు. ఒక్క చాన్స్ ఇవ్వాలని రేవంత్‌రెడ్డి అడుగుతున్నాడని, రెండేండ్ల క్రితమే ఒక్క చాన్స్ ఇస్తే.. ఒకరినీ వదలకుండా అన్ని వర్గాలను మోసం చేశాడని మండిపడ్డారు. ‘సూటీలు రాలేదు.. ఇందిరమ్మ ఇండ్లు రాలేదు.. రూ.4 వేల పెన్షన్ రాలేదు.. ఏ ఒక హామీ అమలు చేయలేదు.. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న తెలంగాణను లాస్ట్ ప్లేస్‌కు దిగ జార్చిండు’ అని నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేవుగాని, లూటిఫికేషన్లు మాత్రం జరుగుతున్నాయని మండిపడ్డారు. ఉద్యోగాలు అడుగుతున్న నిరుద్యోగులను లాఠీలతో కొడుతున్నారని, అశోక్‌నగర్‌కు వచ్చి మీఠా మీఠా మాటలు చెప్పిన రాహుల్‌గాంధీ ఇప్పుడు ఎక్కడికి పోయారని నిలదీశారు. ‘దొంగ ఓట్లు వేస్తం.. పైసలిచ్చి ఓట్లు కొంటమని కాంగ్రెసోళ్లు అంటున్నరు.. పైసలు ఇస్తే తీసుకొని కారు గుర్తుకు ఓటేసి మోసాన్ని మోసంతోనే ఎదిరించాలె’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని బోరబండలో సోమవారం రాత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. వినాయకనగర్, ఎస్సార్టీనగర్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు తరలిరావడంతో బోరబండ రోడ్లు కిక్కిరిసి పోయాయి. దీంతో కేటీఆర్ రోడ్ షో మెల్లగాసాగింది. అంబేద్కర్ చౌరస్తా వద్ద కేటీఆర్ మాట్లాడుతూ కుల మాతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు.
ఒక్కచాన్స్ ఇస్తేనే ఆగం చేసిండ్రు
సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్నాడని, రెండేండ్ల క్రితం ఒక్క చాన్స్ ఇస్తేనే అన్ని వర్గాలను ఆగం చేశాడని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ‘రేవంత్‌కు ఒకఛాన్స్ ఇస్తేనే హైదరాబాద్‌ను నాశనం చేసిండు. పేదల ఇండ్లు కూలగొట్టిండు. రియల్ ఎస్టేట్‌ను భ్రష్టుపట్టించిండు. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న తెలంగాణను లాస్ట్ ప్లేస్‌కు దిగజార్చిండు. మళ్లీ ఏం ముఖం పెట్టుకొని ఒక్క చాన్స్ అని అడుగుతున్నడు?’ అంటూ నిప్పులు చెరిగారు. కూకట్పల్లి, శేరిలింగంపల్లికి వచ్చిన బుల్డోజర్లు రేపు బోరబండకు రావద్దంటే కారును గెలిపించాలని కోరారు. ‘కారు, కాంగ్రెస్ బుల్డోజర్ మధ్య ఎన్నికలు జరుగుతున్నయి. జూబ్లీహిల్స్‌లో నాడు ఇందిరమ్మ గరీబీ హటావో అంటే.. రేవంత్ వచ్చి గరీబోంకో హటావో అంటున్నడు. హైడ్రా బాధితుల బాధను చూస్తుంటే ప్రతి ఒకరి కళ్లల్లో నీళ్లు వస్తయి.
హైడ్రా పేరుతో వేలాది మంది ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చింది. హైడ్రా రాక్షసి మాయం కావాలంటే ఈ నెల 11న కారు గుర్తుకు ఓటెయ్యాలె. ప్రతి పేదవాడికి మేం అండగా నిలబడతం.. బుల్డోజర్లకు అడ్డంగా పండుకుంటం. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు రాకూడదంటే మాగంటి సునీతమ్మను గెలిపించాలె. బుల్డోజర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలె’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

సునీతమ్మకు అండగా కేసీఆర్
మాగంటి సునీత మహిళ ఏం చేస్తదని కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడున్నారని, సునీతమ్మ అంటే ఒక్కరు కాదని ఆమెకు అండగా బీఆర్ఎస్ కుటుంబం ఉన్నదని కేటీఆర్ చెప్పారు. సునీతమ్మకు ఎవ్వరు లేరు భయపెడదాం అనుకుంటున్నరేమో. ఆమెకు అండగా కేసీఆర్ ఉన్నడు. నేనున్నా. విష్ణు ఉన్నడు. పకనే తెలంగాణ భవన్ ఉన్నది. అర్ధరాత్రి ఫోన్ చేసినా అర్ద్దగంటలో మీ వద్దకు వస్తాం. కాంగ్రెస్ వాళ్లు భయపెడితే.. మేం వచ్చి వాళ్ల సంగతి తేలుస్తాం. గల్లాపట్టి నిలదీస్తాం’ అని హెచ్చరించారు. ఎకరాకు రూ.15 వేల రైతుభరోసా ఇస్తామని, రైతులతో పాటు కౌలు రైతులను, రైతు కూలీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని మండిపడ్డారు. ఢిల్లీకి పంపేందుకు పైసలు ఉన్నాయి గాని, గల్లీల్లో ఉండే గరిబోళ్లకు ఇచ్చేందుకు మాత్రం లేవా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు రూ.100 కోట్లు రాహుల్‌గాంధీకి పంపిస్తున్నారని విమర్శించారు.
కంటోన్మెంట్లో పచ్చి అబద్ధాలు
కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. అక్కడ గెలిచి 16 నెలలు అయిందని, 16 రూపాయలైనా మంజూరు చేశారా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఆ నియోజకవర్గానికి పైసా కూడా విడుదల చేయలేదని చెప్పారు. అకడ చేయని అభివృద్ధి.. జూబ్లీహిల్స్‌లో ఎలా చేస్తారో చెప్పాలని నిలదీశారు. ఎలక్షన్ ముందు ఒక మాట.. తర్వాత మరో మాట మాట్లాడటం రేవంత్‌రెడ్డికి మొదటి నుంచీ అలవాటేనని ఫైరయ్యారు. ‘ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు రూ.4 వేలు ఇస్తామని చెప్పి మాట తప్పారు. నోటిఫికేషన్లు లేవు గాని.. లూటిఫికేషన్ మాత్రం చేస్తున్నరు. ఉద్యోగాలు ఇవ్వాలంటున్న నిరుద్యోగులను లాఠీలతో కొడుతున్నారు. అశోక్‌నగర్‌లో నిరుద్యోగులకు తియ్యటి మాటలు చెప్పిన రాహుల్‌గాంధీ పత్తా లేకుండా పోయారు’ అని మండిపడ్డారు.

హిట్లర్‌కే పరాభవం తప్పలే.. రేవంత్ ఎంత?
సర్దార్ కుటుంబాన్ని కూడా ఈ కాంగ్రెస్ సర్కారు ఇబ్బంది పెట్టిందని కేటీఆర్ విమర్శించారు. వాళ్లను పెట్టిన హింసకు సమాధానం చెప్పాల్సిన టైమ్ వచ్చిందని చెప్పారు. ‘హిట్లర్ వంటి నియంతలకు కూడా పరాభవం తప్పలేదు.. రేవంత్‌రెడ్డి ఎంత?’ అని ఎద్దేవాచేశారు. ‘కాంగ్రెస్‌కు ఓటేయకుంటే పథకాలు రద్దు చేస్తమని రేవంత్ బెదిరిస్తున్నడు. ఎవడబ్బ సొమ్మని పథకాలు బంద్ చేస్తరు? రంజాన్ తోఫా లేదు.. బతుకమ్మ చీర లేదు.. క్రిస్మస్ గిఫ్ట్ లేదు.. కేసీఆర్ కిట్ లేదు.. అన్ని బంద్ అయినయి. హైదరాబాద్‌ను బర్బాద్ చేసిన కాంగ్రెస్‌కు 11న ఓట్లతో బుద్ధి చెప్పాలె. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరఫున 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు చెప్పబోతున్నరు. రేవంత్ ఆరాచక పాలనకు చరమగీతం పాడాలె. బోరబండలో బీఆర్ఎస్కు బంపర్ మెజార్టీ ఇవ్వాలె. తీన్ నంబర్ పే హై కారు.. బాకీ సబ్ బేకార్.. దొంగ ఓట్లు వేస్తారట.. పైసలిచ్చి ఓట్లు కొంటారట.. పైసలు ఇస్తే తీసుకొని కారు గుర్తుకు ఓటెయ్యాలె. మోసాన్ని మోసంతోనే గెలవాలె’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. రోడ్ షోలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే పీ విష్ణువర్ధన్‌రెడ్డి, సర్దార్ సతీమణి యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు.

వాళ్లలా బెదిరించి మాట్లాడటం రాదు : మాగంటి సునీతా గోపీనాథ్
‘నాకు మాట్లాడటం రాదని అంటున్నరు.. అవును నిజమే.. నాకు వాళ్లలాగా బెదిరించి మాట్లాడ్డం రాదు’ అని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ చురకలంటించారు. తన కన్నీటిపై కాంగ్రెస్ నేతలు అవహేళనగా మాట్లాడటంపై భగ్గుమన్నారు. ‘దొంగ ఏడుపులు ఏడుస్తున్నది అంటున్నరు. అందరినీ ఒక మాట అడుగుతున్న.. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే మీరు బాధ పడరా? చనిపోయిన వ్యక్తి గురించి వేలాది మంది తరలివచ్చి అమ్మా.. మీకు మేము అండగా ఉన్నామంటే గుండె కన్నీరవదా? గోపన్న కోసం అంతమంది తరలివస్తే.. నాకు ఏడుపు రాదా? మీ గోపన్న కోసం ఇంత మంది తరలివస్తే.. ఇంట్లో మనిషి అయిన నాకు ఎంత బాధ ఉంటది?’ అని తన ప్రశ్నించారు. ‘నాన్న ఆశయాల కోసం మా ఇంటి ఆడబిడ్డలు గడపగడపకు తిరిగి ఓట్లు అడుగుతుంటే వారిపై కేసులు పెడుతున్నరు. నా మీద కూడా ఎన్నో కేసులు పెట్టారు. మీ అందరి గుండెల్లో గోపన్నపై ఎంత అభిమానం ఉన్నదో ఇక్కడికి వచ్చిన వారిని చూస్తేనే తెలుస్తున్నది. ఆడబిడ్డలా ఆశీర్వదించండి. ఎవరికి ఏ బాధ వచ్చినా ఇంటి ఆడబిడ్డగా మీ ఇంటికొచ్చి అండగా నిలబడతా. అర్ధరాత్రి అయినా, అపరాత్రయిన గోపన్నకు ఫోన్‌చేసినట్టు ఫోన్‌చేస్తే నేను మీకు అండగా నిలబడతా. మీకు ధైర్యాన్నిస్తా. గోపన్న ఆశయాన్ని నిలబెడతా. గోపన్న అనుకున్న అభివృద్ధి పూర్తిచేస్తా..ఎవ్వరికీ భయడపాల్సి అవసరం లేదు. కేసీఆర్, కేటీఆర్, విష్ణు మనకు అండగా ఉన్నారు’ అని పేర్కొన్నారు.
ఆడబిడ్డ కన్నీళ్లను అవమానించిండ్రు తన భర్త గోపీనాథ్ గుర్తుకు వచ్చి సునీతమ్మ ఏడిస్తే కాంగ్రెస్ మంత్రులు ఆమెను అవమానించారని, కన్నీళ్లను కూడా రాజకీయం చేస్తే దౌర్భాగ్యులు ఈ కాంగ్రెస్ నేతలు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ‘కేసీఆర్ హయాంలో అన్ని వర్గాలు ఎంతో సంతోషంగా ఉన్నయి. కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ ఎట్లుండె? ఇప్పుడెట్లున్నదో అందరూ ఆలోచించాలె’ అని ప్రజలకు సూచించారు. తులం బంగారం ఇస్తామని చెప్పి కాంగ్రెసోళ్లు మెడలో ఉన్న గొలుసులను కూడా లాకుంటున్నరు’ అని మండిపడ్డారు.

కాంగ్రెస్‌కు ఓటేయకుంటే పథకాలు రద్దు చేస్తనని రేవంత్ బెదిరిస్తున్నడు. నీ అయ్య సొమ్మా? నీ అబ్బ సొమ్మా? ఎవడబ్బ సొమ్మని పథకాలు బంద్ చేస్తవ్? బీఆర్ఎస్ను గెలిపించండి.. కాంగ్రెస్ గల్లా పట్టి పథకాలను అమలు చేయిస్తం. హైదరాబాద్‌ను బర్బాద్ చేసిన కాంగ్రెస్‌కు 11న ఓట్లతో బుద్ధి చెప్పాలె. రేవంత్ ఆరాచక పాలనకు అంతం పలకాలె.
-కేటీఆర్
తన భర్త గోపీనాథ్ గుర్తుకు వచ్చి సునీతమ్మ ఏడిస్తే.. కాంగ్రెస్ మంత్రులు ఆమెను అవమానించిండ్రు. కన్నీళ్లను కూడా రాజకీయం చేస్తే దౌర్భాగ్యులుఈ కాంగ్రెస్ నేతలు. -కేటీఆర్
మాగంటి సునీత మహిళ..ఏం చేస్తదని కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడున్నరు. సునీతమ్మ అంటే ఒక్కరు కాదు.. ఆమెకు అండగా బీఆర్ఎస్ కుటుంబం ఉన్నది. సునీతమ్మకు ఎవ్వరూ లేరని భయపెడదామనుకుంటున్నరేమో! ఆమెకు అండగా కేసీఆర్ ఉన్నడు. నేనున్నా. విష్ణు ఉన్నడు. పకనే తెలంగాణ భవన్ ఉన్నది. అర్ధరాత్రి ఫోన్ చేసినా అర్ద్దగంటలో వస్తం. కాంగ్రెస్ వాళ్లు భయపెడితే..మేం వచ్చి వాళ్ల సంగతి తేలుస్తం.
-కేటీఆర్
జూబ్లీహిల్స్‌లో నాడు ఇందిరమ్మ గరీబీ హటావో అంటే.. రేవంత్ వచ్చి గరీబోంకో హటావో అంటున్నడు. హైడ్రా పేరుతో వేలాది మంది ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చింది. హైడ్రా రాక్షసి మాయం కావాలంటే ఈ నెల 11న కారు గుర్తుకు ఓటెయ్యాలె. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు రావద్దంటే
మాగంటి సునీతమ్మను గెలిపించాలె.బుల్డోజర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలె.
-కేటీఆర్