బెంగుళూరు సిలికాన్ వ్యాలీ నరకం
బెంగళూరులో ఐటీ పరిశ్రమ కేంద్రీకృతమైన సిలికాన్ వ్యాలీలో కనీస సదుపాయాలైన రోడ్లు, విద్యుత్తు, నీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని ఖాతాబుక్ సీఈవో, హౌసింగ్.కామ్ సీవోవో రావిశ్ నరేశ్ అసహనం వ్యక్తంచేశారు. ‘బెంగళూరులోని హెచ్ఆర్ఎస్/కోరమంగళ (భారతదేశ సిలికాన్ వ్యాలీ)లో స్టార్టప్‌లు ఇప్పటికే బిలయన్ల డాలర్ల పన్నులు చెల్లిస్తున్నాయి.
- పల్లెల్లో ఉన్న కనీస సదుపాయాలు కూడా లేవు
- ఖాతాబుక్ సీఈవో రావి నరేశ్ ట్వీట్.. వైరల్
- బ్యాగులు సర్దుకొని హైదరాబాద్‌కు తరలి రండి
- ఇక్కడ అత్యద్భుత భౌతిక, సామాజిక సౌకర్యాలు
- ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆహ్వానం
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): బెంగళూరులో ఐటీ పరిశ్రమ కేంద్రీకృతమైన సిలికాన్ వ్యాలీలో కనీస సదుపాయాలైన రోడ్లు, విద్యుత్తు, నీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని ఖాతాబుక్ సీఈవో, హౌసింగ్.కామ్ సీవోవో రావిశ్ నరేశ్ అసహనం వ్యక్తంచేశారు. ‘బెంగళూరులోని హెచ్ఆర్ఎస్/కోరమంగళ (భారతదేశ సిలికాన్ వ్యాలీ)లో స్టార్టప్‌లు ఇప్పటికే బిలయన్ల డాలర్ల పన్నులు చెల్లిస్తున్నాయి. కానీ ఇప్పటికీ మాకు అధ్వాన్నమైన రోడ్లు, రోజువారీ విద్యుత్తు కోతలు, నాణ్యతలేని నీటి సరఫరా, దారుణమైన ఫుట్‌పాత్‌లే ఉన్నాయి. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు సిలికాన్ వ్యాలీ కంటే మెరుగైన మౌలిక సదుపాయాలున్నాయి. సమీపంలోని ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాలంటే ట్రాఫిక్‌లో మూడు గంటలకు పైగా సమయం పడుతుంది. దయచేసి మాకు సాయం చేయండి’ అని పీఎంవో ఇండియా, ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ4కర్ణాటక, బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యను ట్యాగ్ చేస్తూ శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ట్వీట్‌పై తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్పందించారు.‘మీ బ్యాగులు సర్దుకొని హైదరాబాద్‌కు రండి! మా దగ్గర మెరుగైన భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. మా విమానాశ్రయం అత్యుత్తమైనది. నగరంలోకి రావడం, బయటికి వెళ్లడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మా ప్రభుత్వ దృష్టి త్రీ-ఐ మంత్ర (ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్)పై ఉన్నది’ అని ట్వీట్ చేశారు. కేటీఆర్ చెప్పింది నిజమేనంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. హైదరాబాద్‌లో మంచి వాతావరణంతో పాటు దేశంలోనే అత్యుత్తమ శాంతిభద్రతలు ఉన్నాయి. బెంగళూరు కంటే హైదరాబాద్ చాలా బెటర్.. కేటీఆర్ చెప్పింది 100 శాతం నిజం, ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు మీరు చేస్తున్న కృషి అద్భుతం.. చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది కేటీఆర్ సార్’ అంటూ ట్వీట్లు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

