శిథిలావస్థలో తరగతి గదులు
ప్రైవేట్ పాఠశాలల్లో లక్షల ఫీజులు చెల్లించలేక స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని భావించి తల్లిదండ్రులు పంపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో సుమారు 143 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
- అధ్వానంగా సంగారెడ్డి జిల్లా మునిపల్లి జిల్లా పరిషత్ పాఠశాల
- పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు
- ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు
మునిపల్లి, ఆగస్టు 5 : ప్రైవేట్ పాఠశాలల్లో లక్షల ఫీజులు చెల్లించలేక స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని భావించి తల్లిదండ్రులు పంపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో సుమారు 143 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సరిపడా తరగతి గదులు ఉన్నాయి. అయితే తరగతి గదులు 60 ఏండ్ల క్రితం నిర్మించడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు ఇక్కట్లు తప్పడం లేదు.
ఉపాధ్యాయులు సైతం భయపడుతూ విద్యార్థులకు పాఠాలు చెప్పే పరిస్థితి వచ్చింది. తరగతి గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. గట్టిగా వర్షం వస్తే పాఠశాల కూలిపోయే పరిస్థితికి చేరుకుంది. తడిసిన గోడల మధ్య తరగతులు నిర్వహించడం సంబంధిత అధికారుల నిర్లక్ష్యమని స్థానికులు వాపోతున్నారు.

తడుస్తున్న గోడలు.. భయంతో విద్యార్థులు
వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పాఠశాల తరగతి గదులు పూర్తిగా తడిసి ప్రమాదకరంగా మారాయి. ఉన్నతాధికారులు నిత్యం మం డల కేంద్రానికి వచ్చి వెళ్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంగారెడ్డి కలెక్టర్ స్పందించి విద్యార్థులకు మెరుగైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
మునిపల్లి జిల్లా పరిషత్ పాఠశాల పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పై అధికారుల ఆదేశాల మేరకు విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం. విద్యార్థులకు ఎలాంటి అపాయం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటాం. పాఠశాల పూ ర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులను మరోచోటకు తరలించి తరగతులు నిర్వహించేందుకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం. అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
-భీమ్సింగ్,ఎంఈవో మునిపల్లి మండలం(మెదక్ జిల్లా)
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

